బతుకమ్మ పాటలతో.. మారుమోగుతున్న వేములవాడ పరిసర ప్రాంతాలు!
TeluguStop.com
వేములవాడలో ఆకాశాన్ని అంటిన పూల పండుగ జాతర!కనీవిని ఎరుగని రీతిలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది జనం రాజన్న సిరిసిల్ల జిల్లా :నేడు ఆధ్యాత్మిక క్షేత్రంలో అంబరాన్నింటిన సద్దుల బతుకమ్మ సంబురాలు.
చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి.తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడిపాడారు.
అనంతరం గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు.బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయటంపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్, రూరల్ సీఐ కృష్ణ ప్రసాద్ దగ్గర ఉండి బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
బతుకమ్మ వేడుకలు సందర్భంగా పలువురు ప్రముఖులు రాజకీయ పార్టీల నేతలు వేడుకల్లో పాల్గొన్నన్నారు.
నాని తన సినిమాలను థియేటర్ లో నిలబడే చూస్తారా… ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!