కాషాయజెండాతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు..!
TeluguStop.com
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీదే విజయమని తెలంగాణ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ జెండా పట్టుకుని తిరుగుతుంటే టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని వ్యాఖ్యనించారు.
మునుగోడులో కాషాయ జెండా ఎగరాలని, రాజగోపాల్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
అదేవిధంగా తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!