వర్షాలతో రోడ్డు మొత్తం అస్తవ్యస్తం ప్రయాణం చేయాలంటే ప్రాణ సంకటం

వర్షాలతో రోడ్డు మొత్తం అస్తవ్యస్తం ప్రయాణం చేయాలంటే ప్రాణ సంకటం

యాదాద్రి భువనగిరి జిల్లా: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చౌటుప్పల్ పట్టణ కేంద్రం నుండి జిల్లా యాదాద్రి భువనగిరికి జిల్లా కేంద్రానికి వెళ్లే వలిగొండ ప్రధాన రహదారి మొత్తం దెబ్బతిని గుంతలమయమై ప్రమాదకరంగా మారింది.

వర్షాలతో రోడ్డు మొత్తం అస్తవ్యస్తం ప్రయాణం చేయాలంటే ప్రాణ సంకటం

ఈ రోడ్డులో ప్రయాణం చేయాలంటే ప్రజలు, వాహనదారులు వణికిపోతున్నారు.అయినా సమస్యను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నాయి.

వర్షాలతో రోడ్డు మొత్తం అస్తవ్యస్తం ప్రయాణం చేయాలంటే ప్రాణ సంకటం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసి నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో సంగం మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి.

దీనితో వలిగొండ రోడ్డు మార్గం ద్వారా వెళ్దామనుకునే ప్రయాణికులకు వర్షపు నీరు గుంతలో చేరడంతో ఎక్కడ గుంత ఉందో అర్థంకాని పరిస్థితి నెలకొని ఇబ్బంది పడుతున్నారు.

అధికార పార్టీ నేతలకు ఎన్నికలప్పుడే ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయని,తర్వాత మరిచిపోవడం పరిపాటిగా మారిందని అంటున్నారు.

ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడం మాత్రమే కాదని ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను కూడా పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులైన చేపట్టాలని కోరుతున్నారు.

15సార్లు నా చెంప పగులగొట్టారు.. రన్యా రావు సంచలన లేఖ నెట్టింట వైరల్!

15సార్లు నా చెంప పగులగొట్టారు.. రన్యా రావు సంచలన లేఖ నెట్టింట వైరల్!