కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నేటి నుంచి శ్రీవారి అర్జిత సేవల్లో భక్తులు నేరుగా పాల్గొనే అవకాశం
TeluguStop.com
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నేటి నుంచి శ్రీవారి అర్జిత సేవల్లో భక్తులు నేరుగా పాల్గొనే అవకాశాన్ని ప్రారంభించామన్నారు టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి.
తిరుమల శ్రీవారి ఆలయంలో గత రెండేళ్లలో ఆర్జిత,నిత్య సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని కరోనా కారణంగా రద్దు చేశామని తెలిపారు.
నేడు భక్తులు ఎంతో ఆనందంగా, శ్రీవారి ఆర్జిత, నిత్య సేవల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
కరోనా నుంచి మానవాళిని శ్రీవారు రక్షించారన్నారు అనీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
7/జీ బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్.. ఆ రేంజ్ హిట్ ను అందుకుంటారా?