జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం టీడీపీలో చిచ్చు పెట్టిందని తెలుస్తోంది.
రాజోలు, రాజానగరం టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాజోలు, రాజానగరం( Rajolu, Rajanagaram ) నేతలు భారీగా చేరుకున్నారు.
రాజానగరం టీడీపీ ఇంఛార్జ్ బొడ్డు వెంకటరమణ అనుచరులు భారీగా తరలివచ్చారు.ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కలుస్తున్న టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారని సమాచారం.
కాగా అచ్చెన్నాయుడు రెండు నియోజకవర్గాల టీడీపీ నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.