50 కిలోమీటర్లు డ్రైవర్‌ లేకుండానే పరిగెత్తిన రైలు, అధికారులకు ఉ.. పడిందట

రాజస్థాన్‌లోని సెంద్రా రైల్వే స్టేషన్‌లో ఎల్‌ అండ్‌ టీ సంస్థకు చెందిన మెటీయల్‌తో ప్రయాణిస్తున్న గూడ్స్‌ రైలు ఆగింది.

ఆ రైలు ఇంజిన్‌ ఆఫ్‌ చేయకుండానే లోకో పైలెట్‌ కిందకు తిగాడు.కొద్ది సమయం తర్వాత అతడు బయలు జేరాల్సి ఉంది.

కాని లోకోపైలెట్‌ లేకుండానే ఆన్‌లో ఉన్న రైలు మెల్లగా కదలడం మొదలైంది.చూస్తుండగానే లోకో పైలెట్‌ వచ్చి రైలును ఎక్కేందుకు ప్రయత్నించే లోపు స్పీడ్‌ అందుకుంది.

నిమిషంలో రైలు స్టేషన్‌ దాటి పోయింది.దాంతో వెంటనే పక్క స్టేషన్‌ వారికి సమచారం ఇవ్వడం జరిగింది.

దార్లో ఉన్న రైల్వే గేట్లు అన్ని మూసి వేయాల్సిందిగా సూచించారు.అదే విధంగా రైలును ఆపేందుకు ఇసుక ఇంకా రాళ్లను పట్టాలపై వేయాల్సిందిగా కోరడం జరిగింది.

తర్వాత స్టేషన్‌ వారు ఆ ప్రయత్నం చేసినా కూడా సఫలం కాలేదు.వాటిని దాటేసుకుని ఢీ కొట్టి రైలు అక్కడ నుండి కూడా వెళ్లి పోయింది.

అధికారులకు ఉచ్చ పడుతోంది.ఆ రైలు ఆపే మార్గం ఏదీ వారికి కనిపించడం లేదు.

ఎదురుగా ఏదైనా రైలు వచ్చినా లేదంటే పట్టాలు తప్పినా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

దాంతో ఏం ఉన్నతాధికారులతో మట్లాడుతున్న సమయంలో రైలు 50 కిలో మీటర్లు దూరం ప్రయాణించి సోజాత్‌ స్టేషన్‌కు సమీపంలో ఆగింది.

దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ సంఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.

నిరాడంబరంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం..జెండా ఆవిష్కరించిన కేటీఆర్