ఒక్క కౌగిలింతతో.. ఎన్ని ప్రయోజనాలంటే..

ఒక్క కౌగిలింతతో ఎన్ని ప్రయోజనాలంటే

ప్రేమతో ఒకరిని కౌగిలించుకోవడం అనేది మాటల్లో వ్యక్తపరచలేనిది.ఏమీ మాట్లాడకుండా మీ భావాలను వ్యక్తీకరించడానికి ఇది ఒక శక్తివంతమైన పద్ధతి.

ఒక్క కౌగిలింతతో ఎన్ని ప్రయోజనాలంటే

మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లయితే.ఒక్క నిమిషంలో మంచి అనుభూతిని పొందాలనుకుంటే కౌగిలింతను ఆశ్రయించవచ్చు.

ఒక్క కౌగిలింతతో ఎన్ని ప్రయోజనాలంటే

కౌగిలింత ఒక అద్భుత ఔషధంలా పనిచేస్తుంది.కౌగిలించు కోవడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయని, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మీ రక్తపోటు , హృదయ స్పందన రేటును తగ్గించవచ్చని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి.

కౌగిలింతలు మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతాయి.

కౌగిలించుకోవడం వల్ల అనారోగ్యం లేదా జలుబు వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఒక అధ్యయనం కనుగొంది.

టిమ్ గ్రే, హెల్త్ ఆప్టిమైజింగ్ బయోహ్యాకర్, సైకాలజీ నిపుణుడు, వ్యవస్థాపకుడు మరియు గ్లోబల్ స్పీకర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లోని ఒక పోస్ట్‌లో కౌగిలింత ఆరోగ్యానికి ఎలా అద్భుతాలు చేస్తుందో వివరించారు.

కౌగిలింతలు చాలా శక్తివంతమైనవి.త్వరితగతిన ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి, నిరాశను తగ్గించడానికి, రక్త పోటును తగ్గించడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహద పడతాయి.

ఒక నిమిషం కంటే ఎక్కువసేపు కౌగిలించుకున్నప్పుడు అది అద్భుతమైన అనుభూతిని  కలిగిస్తుంది.కౌగిలింతల సమయంలో సంభవించే ఇతర హార్మోన్ల ప్రతిచర్యలు చాలా శక్తి వంతంగా ఉంటాయి.

కౌగిలింత అనేది సంబంధాలను బలోపేతం చేస్తుంది.ఇది ఎదుటివారు మనకు రక్షణను అందిస్తారో తెలియజేస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పండ్లు తిన‌డం అస్స‌లు మిస్ అవ్వ‌కండి!

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పండ్లు తిన‌డం అస్స‌లు మిస్ అవ్వ‌కండి!