నష్టపోయినా పర్వాలేదు తెరిచేద్దాం

దేశ వ్యాప్తంగా 9 నెలలుగా మూసి వేసి ఉన్న థియేటర్లను తెరిచేందుకు సిద్దం అవుతున్నారు.

ప్రభుత్వం విధించిన నియమ నిబంధన మేరకు 50 శాతం ఆక్యుపెన్సీతో షోలను వేసేందుకు సిద్దం అవుతున్నారు.

అయితే థియేటర్లకు జనాలు రాకపోవచ్చు అనేది ప్రతి ఒక్కరి మాట.థియేటర్లు మూసి ఉన్నప్పుడు కంటే తెరిచి జనాలు రాకుంటే ఎక్కువగా నష్టాలు భరించాల్సి ఉంటుంది.

ఆ నష్టాలను కనీసం రెండు మూడు నెలలు అయినా మోయాల్సి ఉంటుంది.కనుక థియేటర్ల యాజమాన్యాలు గత నెల రోజులుగా మీన మేషాలు లెక్కిస్తున్నారు.

ఆ కారణంగానే ఇప్పుడు థియేటర్లలో సినిమాలను వేసేందుకు ఎక్కవ శాతం మంది ఇప్పటి వరకు ముందుకు రాలేదు.

కాని మొదటి సారి థియేటర్ల యాజమాన్యాలు మాట్లాడుకుని కొన్నాళ్ల పాటు నష్టాలు వచ్చినా భరించి సినిమా థియేటర్లను నడిపించాలనే నిర్ణయానికి వచ్చారు.

మూడు షోలతో డిసెంబర్‌ నుండి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మొదలు కాబోతున్నాయి.

ఇప్పటికే ఏపీలో అనుమతులు రాగా, తెలంగాణలో తాజాగా అనుమతులు వచ్చాయి.చాలా వరకు థియేటర్లు ఓపెన్‌ కాబోతున్న నేపథ్యంలో సినిమాలు కూడా విడుదలకు సిద్దం అవుతున్నాయి.

డిసెంబర్‌ లో చిన్న చితకా సినిమాలు కొన్ని విడుదల చేయబోతున్నారు.ఆ తర్వాత జనవరిలో వరుసగా సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను నమోదు చేసుకుంటాయి అనే నమ్మకం ఉన్న సినిమాలను జనవరిలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

అలా చేస్తే థియేటర్ల ముందు జనాలు క్యూ కట్టి కరోనా గురించి మర్చి పోతారు.

అలా మళ్లీ జనాలు సినిమాలకు అలవాటు పడుతారు అనేది కొందరి విశ్లేషణ.మరి వచ్చే నెల నుండి థియేటర్లను ఓపెన్‌ చేస్తే నష్టాలు వచ్చినా జనవరి లేదా ఫిబ్రవరి నుండి అయినా వసూళ్ల జోరు మొదలై సక్సెస్‌ అయ్యోనో చూడాలి.

దర్శకులు తీసేయాలనుకున్న కూడా ఆ హీరోయిన్స్ నీ సినిమా నుంచి తప్పించలేక పోయారట !