సీఈఐఆర్‌తో పోగొట్టుకున్న మొబైల్ ట్రాక్ చేయొచ్చు, నిశ్చంతగా వుండండి!

మనలో చాలామంది తమ స్మార్ట్ ఫోన్( Smart Phone ) పోయినపుడు చాలా కంగారు పడిపోతూ వుంటారు.

ఎందుకంటే వారి బాధ, కంగారు స్మార్ట్ ఫోన్ పోయిందని కాదు, అందులో విలువైన సమాచారం పోతుందేమోనని భయపడిపోతూ వుంటారు.

ఎందుకంటే అందులో ఎన్నో జ్ఞాపకాలు పదిలపరుచుకుంటూ వుంటారు.అయితే అలాంటివారు ఇపుడు బాధ పడాల్సిన అవసరం లేదు.

ఐఎంఈఐ( IMEI ) ఆధారంగా సీఈఐఆర్( CEIR ) లో నమోదు చేస్తే పోయిన ఫోన్ ఎవరి దగ్గర, ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకోవడం ఇపుడు చాలా ఈజీ.

"""/" / గతంలో పోయిన మొబైల్‌ ఫోన్లు తిరిగి దొరికే అవకాశాలు చాలా తక్కువ.

కానీ ఇప్పుడు సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఈఐఆర్‌) పేరిట కేంద్ర టెలికం శాఖ మొబైల్‌ యూజర్లకు మోడరన్‌ సేవలు వినియోగంలోకి తేవడం వలన పోగొట్టుకున్న స్మార్ట్‌ ఫోన్‌ వెతికి, అది ఎక్కడ ఉందో తెలుసుకుని పెట్టుకోవచ్చు.

ఈ తరహా సేవలను 2019లోనే మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో( Maharashtra And Goa ) ప్రయోగాత్మకంగా పరీక్షించగా ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల మొబైల్‌ యూజర్లకు ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

"""/" / స్మార్ట్‌ ఫోన్‌ ఐఎంఈఐ ఆధారంగా ఈ సీఈఐఆర్‌ అనేది పని చేస్తుంది.

గూగుల్‌ ప్లే స్టోర్‌కెళ్లి 'నో యువర్‌ మొబైల్‌’ అనే పేరుతో వున్న మొబైల్‌ యాప్‌ వర్షన్‌ డౌన్లోడ్ చేసుకోవాలి.

మీ ఫోన్‌ పోయిన తర్వాత యూజర్‌.సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

తర్వాత సీఈఐఆర్‌ ఓపెన్ చేసి పోయిన డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్షన్‌లో ఫోన్‌ నంబర్‌, ఐఎంఈఐ నంబర్‌, ఫోన్‌ బ్రాండ్‌ పేరు, మోడల్‌ తదితర వివరాలు నమోదు చేసి, మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు రశీదు ఫొటో అప్‌లోడ్‌ చేయాలి.

తరువాత కూడా అడిగిన డీటెయిల్స్ నమోదు చేసి సబ్మిట్‌ క్లిక్‌ చేయాలి.అటుపై యూజర్‌ ఫిర్యాదు స్వీకరిస్తున్నట్లు రిక్వెస్ట్‌ ఐడీ నంబర్ వస్తుంది.

యూజర్‌ సమర్పించిన వివరాల ఆధారంగా సదరు మొబైల్‌ ఫోన నంబర్‌ను 24 గంటల్లో సీఈఐఆర్‌ బ్లాక్‌ చేస్తుంది.

అటుపై ఆ ఫోన్‌ వివరాలను మొబైల్‌ నెట్‌ వర్క్‌ ఆపరేటర్లకు పంపుతుంది.

నేను ఏ పరిస్థితి లో ఉన్న ఆ ముగ్గురు ఫోన్ లిఫ్ట్ చేస్తారు : కమెడియన్ సుధాకర్