డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..!!
TeluguStop.com

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది.ఈ మేరకు డిసెంబర్ 4వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానుండగా ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది.


ఈ శీతాకాల సమావేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2 అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.


ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఈ సమావేశం జరగనుంది.ఈ మేరకు అన్ని పార్టీలకు పార్లమెంటరీ శాఖ లేఖలు రాసింది.
అదేవిధంగా పార్లమెంటరీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా నేతలకు వ్యక్తిగత లేఖలు పంపనున్నారు.
మొత్తం 19 రోజుల పాటు సాగే ఈ సమావేశాలు డిసెంబర్ 22 తో ముగియనున్నాయి.
కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అమెరికాలో చరిత్ర సృష్టించిన కాష్ పటేల్.. ఎఫ్‌బీఐ చీఫ్‌గా సెనేట్ ఆమోదం