ఈ శీతాకాలంలో మీ స్కిన్ టోన్ కి తగ్గట్టు సరైన ఫేస్ క్రీమ్ ఎంచుకోండి.. లేదంటే అంతే..!

శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహించాలో చర్మం పట్ల కూడా అంతే జాగ్రత్త వహించాలి.

ఈ సీజన్లో ఎక్కువగా జలుబు, దగ్గు, అలెర్జీ వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

అలాగే ఈ సీజన్ లోనే చర్మ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మీ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

మీ చర్మంపై మీరు రాసే క్రీమ్ విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి.చర్మం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చూపినాగాని మీ స్కిన్ డామేజ్ అవ్వడంతో పాటు మీ అందం కూడా తగ్గిపోతుంది.

అయితే చాలా మంది చర్మం పొడిగా ఉందనో లేక నిర్జీవంగా మారుతుందనే మార్కెట్లో దొరికే ఏదో ఒక కోల్డ్ క్రీమ్ రాస్తుంటారు.

కానీ అలా ఏది పడితే అది చర్మానికి రాసుకోవడం మంచిది కాదు.మీ స్కిన్ టోన్ కి తగ్గట్టుగా క్రీమ్ లను ఎంచుకుని వాటిని అప్లై చేయాలి.

మరి మీ స్కిన్ టోన్‌ను బట్టి సరైన క్రీమ్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

అసలు ముందుగా మీ చర్మం యొక్క స్వభావాన్ని తెలుసుకుని దాన్ని బట్టి సరైన క్రీమ్ ఎంచుకోవాలి.

ఒకవేళ మీ చర్మం పొడిగా ఉన్నట్లయితే మీ చర్మంలో ఆయిల్ తక్కువగా ఉన్నట్లు.

అందుకనే చర్మంపై క్రీమ్ అప్లై చేసిన తర్వాత కూడా మీ చర్మం పొడిగా మారుతుంది.

అందుకనే పొడి చర్మం పై క్రీమ్ ఎక్కువసేపు పనిచేయదు. """/" / అందుకనే పొడి చర్మం కలిగి ఉన్నవారు హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉన్న అటువంటి క్రీమ్లను ఎంచుకోని వాడాలి.

మరి మీ చర్మం జిడ్డుగా ఉన్నట్లయితే మీ ముఖం జిడ్డుగా కనిపిస్తుంది.అప్పుడు మీరు ముఖంపై క్రీమ్ అప్లై చేస్తే మీ ముఖం మరింత జిడ్డుగా మారుతుంది.

అందుకనే జిడ్డుచర్మం గలవారు జెల్, సీరం చాలా తక్కువ హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉన్న క్రీమ్ ఎంచుకోవాలి.

అలాగే సెన్సిటీవ్ స్కిన్ ఉన్నవారికి ఈ కాలంలో ఎక్కువగా దురదలు వచ్చే సమస్య ఉంటుంది.

అటువంటి చర్మం ఉన్నవారు ముందుగానే క్రీమ్ విషయంలో జాగ్రత్తలు వహించాలి.ఏది పడితే అది రాస్తే చర్మం పై అలెర్జీని కలిగిస్తాయి.

అందుకనే మృదువైన చర్మం కలవారు యాంటీ ఆక్సిడెంట్ల సువాసనలు లేని క్రీములను ఎంచుకుంటే మంచిది.

లిక్విడ్ నైట్రోజన్ అంటే ఏమిటి? దీన్ని ఎందు కోసం ఉపయోగిస్తారో తెలుసా..?