అమెరికాలో మళ్ళీ పేలిన తూటా

దీపావళి టపాసులు పేల్చుతున్న సులభంగా అమెరికాలో తుపాకులు పెల్చుతున్నారు.నెలలో ఎదో ఒక ప్రాంతంలో తుపాకుల మోతలు మొగాల్సిందే.

ఈ వరుస తుపాకుల ఘటనలు అమెరికా ప్రజల స్వేచ్చని హరిస్తున్నా సరే ప్రభుత్వం ఇప్పటికి కూడా తుపాకుల చట్టంపై దృష్టి పెట్టక పోవడం మానవతా వాదులని కలవరపెడుతోంది.

ఎన్నో ఏళ్ళ నుంచీ అమెరికాలో పాతుకు పోయిన గన్ కల్చర్ ని రూపు మాపాలని ప్రయత్నాలు చేస్తూన్నా ఫలితం కనిపించలేదు.

ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కి ఎన్నో వినతులు వెళ్ళినా సరే ఇప్పటికి కూడా సరైన నిర్ణయం తీసుకోక పోవడం గమనార్హం.

హోటల్స్,సినిమా దియేటర్లో , చివరికి స్కూల్స్ లో సైతం ఈ తుపాకుల మోతలు మోగుతూనే ఉన్నాయి.

సెనేట్ లో సైతం ఈ గన్ కల్చల్ పై చర్చకి వచ్చినా సరే ఇప్పటి కూడా కార్యరూపం దాల్చలేదు.

ఈ ఒక్క నెలలోనే సుమారు మూడు ప్రాంతాలలో వేరువేరు సందర్భాలలో గన్ ఫైర్ జరిగింది తాజాగా """/"/అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

విన్స్టన్ సేలంలోని పబ్లిక్ వర్క్స్ భవనంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు జరిగాయి.

కాల్పుల్లో ఇద్దరు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ప్రస్తుతానికి వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అంటున్నారు పోలీసులు.

కాల్పులకి ఎవరు పాల్పడ్డారు అనే విషయం త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు పోలీసులు.

చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చరణ్.. ఎంత చక్కగా పాడారో?