ఆఫర్లు లేకున్నా వింక్ బ్యూటీ ఆ విషయంలో తగ్గట్లేదట!

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సినిమా ల్లో ఒక వెలుగు వెలుగుతుందని అంతా కూడా అనుకున్నారు.

కాని ఆమె సోషల్‌ మీడియా వరకే పరిమితం అయ్యింది.ఆ సమయంలో ముద్దు గన్ను పేల్చడంతో పాటు.

కన్ను గీటడం తో ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో ఏకంగా సెలబ్రెటీ అయిన విషయం తెల్సిందే.

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్ యొక్క జోరు సినిమా ల్లో ఏమాత్రం లేకున్నా కూడా పారితోషికం విషయంలో మాత్రం ఈ అమ్మడు తగ్గేదే అన్నట్లుగా డిమాండ్‌ చేస్తోంది.

అన్ని విధాలుగా ఈ అమ్మడు ఆఫర్ల విషయంలో వెతుక్కోవాల్సి ఉంది.అయినా కూడా ఈమె మాత్రం పారితోషికంను రోజుకు అయిదు నుండి ఏడు లక్షల వరకు డిమాండ్‌ చేస్తుంది.

తాజాగా ఒక చిన్న ఈవెంట్‌ లో పాల్గొనేందుకు ఈమె చేసిన డిమాండ్‌ తో ఆ ఈవెంట్‌ నిర్వాహకులు ఆశ్చర్యపోయారట.

సినిమా ల్లో కూడా నటించేందుకు 50 లక్షలకు పైగానే ఈమె డిమాండ్ చేస్తున్న కారణంగానే చిన్న సినిమాలు.

లో బడ్జెట్‌ సినిమా ల్లో కూడా ఈమెకు ఆఫర్లు రావడం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సోషల్‌ మీడియా హంగామా తో అయినా ఈమెకు ఆఫర్లు వస్తాయా అంటూ టాక్ వినిపిస్తుంది.

అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ లకు ఈమె ఏమాత్రం తగ్గడం లేదు.

అయినా కూడా ఆఫర్లు ఈమెకు రావడం లేదు.ఒక వేళ ఆఫర్లు వస్తే వాటిని కాస్త నో చెప్పి భారీ పారితోషికం ను ఈమె డిమాండ్‌ చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

ఆఫర్లు లేకున్నా ఇంత పారితోషికం డిమాండ్‌ చేయడం ఏంటో ఆమెకే తెలియాలి. ఈ మలయాళ ముద్దుగుమ్మ తెలుగు లో కూడా ఒకటి రెండు సినిమా లను పారితోషికం కారణంగా వదిలేసింది.

నిన్ను చాలా మిస్ అవుతున్నా… ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మిక.. ఏమైందంటే?