ఆగలేక మద్యం దొంగతనాలకు పాల్పడుతున్న మందు బాబులు….

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి.ఇందులో భాగంగా అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన అన్ని సర్వీసులను మూసివేశారు.

దీంతో గత 15 రోజులుగా మందు బాబులు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మరికొందరైతే విచక్షణ కోల్పోయి ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.అయితే ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల కారణంగా మద్యం దుకాణాలను మూసి వేసినప్పటికీ కొందరు అక్రమంగా మద్యాన్ని బ్లాక్ లో అమ్ముతున్నారు.

అయితే డబ్బు ఉన్న వాళ్ళు మద్యం బ్లాక్ లో కొంటుంటే లేనివాళ్ళు ఇతర దారులు వెతుక్కుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లాలోని పెనమాలోరు ప్రాంతంలో ఉన్నటువంటి ఓ మద్యం దుకాణంలో దాదాపుగా లక్షా 50 వేల రూపాయలకు పైచిలుకు విలువ చేసే మద్యం బాటిళ్లు చోరీకి గురయ్యాయి.

దీంతో దుకాణదారుడు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి దుకాణ యజమాని ని విచారించగా ఇది మద్యానికి బానిసలైనటువంటి వారే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

అలాగే ప్రస్తుతం మద్యం దుకాణాలు తెరవకపోవడంతో మందుబాబులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక రోజుకి కనీసం రెండు గంటల సమయం పాటలు అయినా మద్యం దుకాణాలు తెరవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

నిత్యం మద్యం సేవించే వాళ్ళు ఒక్కసారిగా మద్యం దొరక్కపోవడంతో పలు అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయంటూ మరి కొందరు వాపోతున్నారు.