ప్రజల ప్రాణాలు పోతే బాధ్యత తీసుకుంటావా సామ్.. బ్యాడ్మింటన్ ప్లేయర్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.సమంత ఇటీవల కాలంలో సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే వార్తల్లో నిలుస్తోంది.
సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది సమంత.అందులో భాగంగానే తాజాగా మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది.
ఆ వివరాల్లోకి వెళితే.ఇటీవల సమంత షేర్ చేసిన ఒక ఆరోగ్య చిట్కా ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
"""/" /
హైడ్రోజన్ ఫిరాక్సైడ్ పెరాక్సైడ్ నేబ్యులైజేషన్( Hydrogen Peroxide ) వాడకంపై ఈ అమ్మడు సూచించిన చిట్కాపై డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు.
సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణాలు పోతాయంటూ ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరించారు.ఈ క్రమంలోనే సమంతపై డాక్టర్ లివర్ డాక్ ఫైర్ అయ్యాడు.
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఆమెను జైల్లో పెట్టాలంటూ పలు పోస్టులు పెట్టాడు.అయితే దీనికి వంత పాడుతూ ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల( Jwala Gutta ) కూడా సమంతపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
జనాలకు హెల్త్ టిప్స్ ఇస్తున్న సెలబ్రిటీలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడగదల్చుకున్నాను.
"""/" /
మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా చనిపోతే పరిస్థితేంటి? ఎదుటి వారికి సహాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే.
కాదనను కానీ జరగరానిది జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్ బాధ్యత తీసుకుంటారా? అంటూ ట్విట్టర్ వేదికగా సామ్ పై విమర్శలు కురిపించింది జ్వాల.
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.చాలామంది నెటిజన్స్ కూడా సమంతపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ పోస్టులు చేస్తున్నారు.
కొందరు డబ్బుల కోసం ఎలాంటి ఈ పనైనా చేస్తారు ఈ సెలబ్రిటీలు అంటూ మండిపడుతున్నారు.
మరి ఈ పోస్టులపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.