ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా?: పురంధేశ్వరి
TeluguStop.com
ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.
విధానపరమైన లోపాలను ఎత్తి చూపతే టీడీపీ కోవర్టా అని ప్రశ్నించారు.ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయని పురంధేశ్వరి తెలిపారు.
అనంతరం ఏపీలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామని చెప్పారు.రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పెద్ద పీట వేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీకి అధికారంలో కొనసాగే అర్హత లేదని చెప్పారు.ఏపీకి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు.
అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ బీజేపీ అని ఆమె స్పష్టం చేశారు.
Validation Check 2026-03-24 10:38:07