NRI మహిళ ఓవరాక్షన్.. జాతి వివక్షతో రెచ్చిపోతే ఊరుకుంటారా? పోలీసులేం చేశారో చూడండి..!

nri మహిళ ఓవరాక్షన్ జాతి వివక్షతో రెచ్చిపోతే ఊరుకుంటారా? పోలీసులేం చేశారో చూడండి!

యూకేలో( UK ) ఒక భారతీయ సంతతికి చెందిన మహిళ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.

nri మహిళ ఓవరాక్షన్ జాతి వివక్షతో రెచ్చిపోతే ఊరుకుంటారా? పోలీసులేం చేశారో చూడండి!

ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిపై ఆమె జాతి వివక్ష వ్యాఖ్యలు చేసింది.అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆమె మాత్రం ఫుల్ బ్రిటిష్ యాసలో మాట్లాడుతూ, ఎదుటి వ్యక్తిని "నీ దేశానికి తిరిగి వెళ్లిపో" అని హుకుం జారీ చేసింది.

nri మహిళ ఓవరాక్షన్ జాతి వివక్షతో రెచ్చిపోతే ఊరుకుంటారా? పోలీసులేం చేశారో చూడండి!

వీడియోలో రికార్డ్ అయిన ఈ ఘటనలో, ఆ మహిళ ట్యునీషియాకు చెందిన వ్యక్తిలా కనిపిస్తున్న ప్రయాణికుడిని చాలా దురుసుగా తిడుతూ కనిపించింది.

తాను పుట్టింది ఇండియాలోనే అయినా, తెల్లతోలు బ్రిటిష్ వాళ్లలా బిల్డప్ కొడుతూ, ఫేక్ యాసతో గొప్పలు పోయింది.

మాట్లాడుతున్నంతసేపూ ఆమె మొహం నిండా పొగరు.ఎదుటి వ్యక్తి ఎంత నెమ్మదిగా తన వాదన వినిపిస్తున్నా, ఈమె మాత్రం అతన్ని చిన్నచూపు చూస్తూనే ఉంది.

ఆ వ్యక్తి తనను తాను కాస్త వెనకేసుకొనే ప్రయత్నం చేస్తే, వెంటనే సీన్ రివర్స్ చేసి తనే బాధితురాలిగా నటించడం మొదలుపెట్టింది.

"""/" / ఈ వీడియో సోషల్ మీడియాలో( Social Media ) క్షణాల్లో వైరల్ అయిపోయింది.

నెటిజన్లు ఆమె ప్రవర్తనపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.ఒక వలసదారు అయ్యుండి ఇంకో వలసదారుడిని దేశం విడిచి వెళ్ళమని చెప్పడం ఏంటని అందరూ ముక్కున వేలేసుకున్నారు.

కొంతమంది భారతీయులు విదేశాలకు వెళ్లిన తర్వాత తామేదో గొప్ప అనుకుంటూ ఎలా ప్రవర్తిస్తారో అంటూ కామెంట్స్ చేశారు.

తాము కూడా అక్కడి సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా, వేరే మైనారిటీల కంటే తామే ఎక్కువ అనే ఫీలింగ్‌లో ఉంటారని దుమ్మెత్తిపోశారు.

"""/" / ఆ మహిళ చేసిన పనికి అందరూ నవ్వుకున్నారు, ట్రోల్స్ చేశారు.

వేరే దేశం నుంచి వచ్చిన వ్యక్తిని తిడుతూ, తను మాత్రం బ్రిటిష్( British ) దానిలా బిల్డప్ ఇవ్వడం చూసి జనాలు వెటకారాలు ఆడారు.

వీడియో తీస్తున్నారని తెలిసినా కూడా ఆమె ఏ మాత్రం తగ్గకుండా జాతి వివక్ష చూపించడంతో జనం మరింత మండిపడ్డారు.

చివరికి పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేశారు.ఇప్పుడు ఆమె లీగల్ చిక్కుల్లో పడింది.

తమకు నచ్చినట్టు ప్రవర్తిస్తే ఎవరూ ఏమీ చేయలేరనుకునే వాళ్ళకి, దేశాలు దాటినా మీ పప్పులుడకవు అని చెప్పడానికి ఈ అరెస్ట్ ఒక గుణపాఠం అంటున్నారు.

ఈ ఘటన మనకు ఒక విషయం చెబుతోంది.మన గురించి మనం తెలుసుకోవాలి.

మనలో ఉన్న తప్పుడు భావాలు ఒక్కోసారి మన పరువు తీసేస్తాయి.ఈ రోజుల్లో ఇలాంటి ప్రవర్తనను ఎవరూ ఊరుకోరు అని గుర్తుంచుకోవాలి.

ఇండియా లైఫ్‌స్టైల్ బెస్ట్ అంటున్న కెనడా ఎన్నారై.. కారణం తెలిస్తే అవాక్కవుతారు…

ఇండియా లైఫ్‌స్టైల్ బెస్ట్ అంటున్న కెనడా ఎన్నారై.. కారణం తెలిస్తే అవాక్కవుతారు…