ఎలుక వర్సెస్ ఎలుక.. రెజ్లింగ్‌లో లాగా డిష్యుం డిష్యుం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..?
TeluguStop.com
సాధారణంగా జంతువులు అనేవి ఒకదానికొకటి పోట్లాడుకుంటూ ఉంటాయి.ఇవి హాని చేసుకోకుండా ఒక దానిపై ఒకటి పంచులు విసురుకుంటూ పోట్లాడుతుంటే చూడ్డానికి భలే సరదాగా ఉంటుంది బాక్సింగ్, డబ్ల్యూడబ్ల్యూఈ( Boxing, WWE ) ఫైట్స్‌ను ఇవి తలపిస్తుంటాయి.
తాజాగా రెండు ఎలుకలు ఇట్లాంటి ఫైట్ లో పాల్గొని అందరికీ షాకిస్తున్నాయి.సోషల్ మీడియాలో వీటి ఫైటింగ్ వీడియో బాగా వైరల్ అయింది.
"""/" /
ఆ వీడియోలో రెండు ఎలుకలు( Rats ) ఒకదానితో ఒకటి చాలా దారుణంగా పోట్లాడుకుంటున్నాయి.
అంటే, పిల్లి ఎలుకలను వేటాడే సాధారణ దృశ్యం కాదు ఇది.ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు.
అంతేకాదు, ఈ పోరు చూసి నవ్వు కూడా వచ్చింది.ఈ వీడియోని @Ghar Ka Kalesh అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో రెండు ఎలుకలు ఒక గ్రోసరీ స్టోర్‌లోని పైభాగంలో చాలా దూకుడుగా పోట్లాడుకుంటున్నాయి.
అవి ఒకదానిపై ఒకటి దూకి, గోరుతో పట్టుకుని, గొంతు సొక్కబెట్టుకుంటున్నాయి.ఈ రాడ్స్ ఫైటింగ్ కి డబ్ల్యూడబ్ల్యూఈ కామెంట్రీ చెప్పారు.
అందువల్ల ఈ వీడియో మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. """/" /
ఎలుకల పోరు చూసి మీకూ నవ్వు వస్తుంది, అదే సమయంలో ఆశ్చర్యం కూడా వేస్తుంది.
ఎందుకంటే సాధారణంగా ఎలుకలంటే పిల్లులకు ఆహారం అని అనుకుంటాం కదా! కానీ ఈ వీడియోలో రెండు ఎలుకలు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటున్నాయి.
అక్కడ చాలా ఆహార పదార్థాలు ఉండటం వల్ల, ఆ రెండు ఎలుకలు ఏదో ఆహారం కోసం గొడవ పడుతున్నట్లు అనిపిస్తుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.ఇది చాలా విచిత్రమైన, ఫన్నీ సంఘటన అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియో చూస్తే, చిన్న జీవులు కూడా ఎంత పెద్ద పెద్ద గొడవలు చేస్తాయో అనిపిస్తుంది.
స్పాట్ లెస్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ కోసం ఈ ఫ్రూట్ మాస్క్ ను ప్రయత్నించండి!