రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటించనుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్( Ram Charan ).

ఈయన ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా రిలీజ్ దశకి చేరుకుంది.

అయినప్పటికీ ఈ సినిమా అయిపోయిన తర్వాతే తను బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక దీని ప్రకారం బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో వచ్చే సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నట్టుగా కనిపిస్తుంది.

"""/" / ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక స్టార్ నటి నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్( Star Heroine ) గా గుర్తింపు పొందిన ఆవిడ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది.

ఆవిడ ఎవరు అంటే అలనాటి మేటి స్టార్ హీరోయిన్ అయిన రమ్యకృష్ణ.ఇక ఈమె నీలాంబరిగా నరసింహ సినిమాలో నటించి ఆ సినిమాలో రజనీకాంత్ ను సైతం ఢీ కొట్టిన రమ్యకృష్ణ( Ramya Krishna ) ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రాణిస్తుంది.

బాహుబలి సినిమాలో శివగామి గా నటించి మెప్పించిన ఈవిడ ఇప్పుడు ఇండియాలోని పలు భాషల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది.

"""/" / ఇక మొత్తానికైతే ఈమె నటించిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి.

ఇక ఈ సినిమాలో కూడా ఈమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

అందుకోసమే ఆ పాత్ర కోసం రమ్యకృష్ణ అయితేనే బాగుంటుందనే ఉద్దేశ్యం తో బుజ్జిబాబు ఆవిడని సెలెక్ట్ చేసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక బుచ్చి బాబు రామ్ చరణ్ సినిమాలో స్టార్ కాస్టింగ్ అనేది భారీ స్థాయి లో పెరిగిపోతుంది.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!