శ్రీ మహావిష్ణువును ఆ మాసంలో ఒక్కరోజు పూజించిన వేల సంవత్సరాల పుణ్యం లభిస్తుందా..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాల విభజన సూర్య చంద్రుల వల్ల జరుగుతుందని చెబుతారు.

చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రమునకు దగ్గరగా ఉంటాడో, ఆ నక్షత్రము ఆధారంగా మాసములు ఏర్పడుతూ ఉంటాయి.

ఉదాహరణకు పౌర్ణమి చంద్రుడు మృగశిరా నక్షత్రం దగ్గర సంచరించడం వల్ల కేంద్ర మాసం ప్రకారం ఈ మాసమును మార్గశిర మాసమని పిలుస్తూ ఉంటారు.

సూర్య సిద్ధాంతం ప్రకారం సూర్యుడు ఏ రాశి నందు సంచరిస్తాడో ఆ మాసమునకు ఆ రకమైన పేరు ఏర్పడినట్లు పిలుస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే డిసెంబర్ 16వ తేదీన సూర్యుడు ధను రాశిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

అందుకే డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ మధ్య ఉన్నటువంటి మాసమును ధనుర్మాసమని చెబుతూ ఉంటారు.

ధనుర్మాసము మార్గశిర మాసంలో సంభవించడం విశేషం.దక్షిణాయానంలో ఆఖరి మాసం మార్గశిర మాసం అని కృష్ణుడు భగవద్గీతలో స్వయంగా చెప్పారు.

అందువల్ల ఆ మార్గశిర మాసమునకు చాలా ప్రాముఖ్యత ఉంది.అంతేకాకుండా ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసము, శివరాధనకు కార్తీక మాసం ఎంతటి విశిష్టమైనదో, విష్ణుమూర్తి ఆరాధనకు ధనుర్మాసం అంతే పవిత్రమైనది.

ధనుర్మాసంలో విష్ణుమూర్తి దేవాలయంలో దర్శనము చేసుకొని మహావిష్ణువును దర్శించిన వారికి కొన్ని వేల కోట్ల పుణ్యం లభించే అవకాశం ఉంది.

ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రపరచుకొని లక్ష్మీదేవి వద్ద ఆవు నెయ్యి తో దీపారాధన చేసిన వారి పై లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.

ధనుర్మాసంలో ఏ ఒక్కరోజు మహావిష్ణువుని పూజించిన కొన్ని వేల సంవత్సరాలు మహావిష్ణువు పూజించిన పుణ్య ఫలితము లభిస్తుంది.

"""/"/ ఏ వ్యక్తి అయితే జీవితంలో ఆనందమును, ఆయుష్షును మరణాంతరం మోక్షమును కోరుకుంటాడో, అలాంటి వ్యక్తి కచ్చితంగా ధనుర్మాసంలో ఆచరించడం మంచిది.

ధనుర్మాసము ఆచరించేవారు సూర్యోదయమునకు ముందే నిద్ర లేచి స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకుని మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో తులసి దళముతో పూజించడం మంచిది.

అలాగే మహావిష్ణువును పంచామృతాలతో అభిషేకించి తులసి శంఖములోని నీళ్లతో స్వామిని అభిషేకించడం వంటివి చేయాలి.

విష్ణుమూర్తి ని పూజించే మాసము కాబట్టి ఈ మాసంలో శుభకార్యాలలో నిషేధించారు.

ప్రార్ధనా స్థలాల వద్ద కాన్సులర్ క్యాంప్‌లు వద్దు : భారత్‌కు కెనడా అడ్వైజరీ