ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తా : భారత్‌కు కాబోయే అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి

భారత్- అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగు పరచడానికి కృషి చేస్తానన్నారు.  భారత్‌లో అమెరికా రాయ బారిగా నామినేట్ అయిన ఎరిక్ గార్సెట్టి.

ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ లోని ప్రముఖులతో జరిగిన డిన్నర్ భేటీలో గార్సెట్టి మాట్లాడుతూ.

అమెరికా భారత్ బంధానికి బైడెన్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు.యోగి, మోనికా చుగ్ హోస్టులుగా వ్యవహరించిన ఈ ఇంటరాక్షన్‌లో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడంపై గార్సెట్టీ కీలకవ్యాఖ్యలు చేశారు.

భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా మాట్లాడుతూ.చైనా విస్తరణ కాంక్షకు చెక్ పెట్టడంలో భారత్‌కు అమెరికా బాసటగా నిలుస్తుందన్నారు.

ఇక ఈ భేటీలో ఇండో అమెరికన్ వ్యాపార వేత్తలు వినోద్ ఖోస్లా, కన్వల్ రేఖీ, ఇండియా స్పోరా వ్యవస్థాపకుడు ఎంఆర్ రంగస్వామి, అరుణ్ కుమార్, విశాల్ గ్రోవర్, నీల్ మఖిజా, బీజే అరుణ్, శివ్ సాంబశివం, సుష్మా మల్హోత్రా, అనితా మన్వానీ భగత్, అర్జున్ భగత్, అనిల్ గోధ్వానీ, వినీతా గుప్తా, సుమీర్ చద్దా, కార్ల్ మెహతా, రాజు రెడ్డి, ఆనంద్ రాజా రామన్, కరుణా కరన్, ఖండేరావ్ కాండ్ తది తరులు హాజరయ్యారు.

కాగా.ఎరిక్ గార్సెట్టికి డెమొక్రాట్లలో సమర్థుడైన నేతగా పేరుంది.

మూడు దశాబ్ధాల తర్వాత వేసవి ఒలింపిక్స్‌ను అమెరికా గడ్డపైన తిరిగి నిర్వహించేందుకు ఆయన చేసిన ప్రయత్నం విజయ వంతమైంది.

దేశంలో అత్యంత రద్దీగా వుండే రెండో ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ అయిన లాస్ ఏంజిల్స్ మెట్రోకు గార్సెట్టి అధ్యక్షత వహిస్తున్నారు.

దీనిలో కొత్తగా 15 లైన్లను నిర్మిస్తున్నారు.అంతే కాకుండా పారిస్ వాతావరణ ఒప్పందాన్ని అమెరికాలోని 400 మంది మేయర్లు పాటించే విధంగా ఏర్పాటు చేసిన ‘‘ క్లైమేట్ మేయర్‌’’కు కో ఫౌండర్‌గా ఎరిక్ వ్యవహరిస్తున్నారు.

"""/" / యూఎస్ నేవీ రిజర్వ్ కాంపోనెంట్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా 12 ఏళ్లపాటు పనిచేసిన గార్సెట్టి.

2017లో లెఫ్టినెంట్‌గా రిటైర్ అయ్యారు.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు.

యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు.

నామినేషన్‌పై ఎరిక్‌ గార్సెట్టి హర్షం వ్యక్తంచేశారు.భారత్‌లో అమెరికా రాయబారిగా నామినేట్‌ చేయడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని చెప్పారు.

ఇండియాలో విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కొత్త సినిమా ప్రారంభించిన ప్రభాస్.. ఘనంగా పూజా కార్యక్రమాలు పూర్తి!