Vijay Deverakonda Ram Pothineni : ఆ ఇద్దరు హీరోలపై భారం వేసిన నిర్మాతలు.. ఆశలన్నీ వారిపైనే?
TeluguStop.com
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఖుషి సినిమా పేరు కూడా ఒకటి.
శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమాలో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) సమంత కలిసి నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
కాగా సమంత నటించిన గత మూవీ శాకుంతలం, దేవరకొండ నటించిన లైగర్ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన విషయం తెలిసిందే.
దీంతో ఈ ఇద్దరికీ ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యం.ఖుషి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి నిలబడాలి.
"""/" /
లేకపోతే విజయ్ దేవరకొండ మార్కెట్ దిగజారిపోవడం గ్యారెంటీ.ప్రస్తుతం విజయ, సమంత కాంబోలో వస్తున్న ఖుషీ( Kushi Movie ) ముందు రూ.
53 కోట్ల బిజినెస్ టార్గెట్ నిలిచి ఉంది.వారి సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది.
అలాగే ఇండస్ట్రీలోని ఒక హీరోకు కూడా విజయ్ దేవరకొండ పరిస్థితే ఉంది.ఆ మరెవరో కాదు యంగ్ ఎనర్జిటిక్ స్టార్ గా పేరు పొందిన రామ్ పోతినేని.
ప్రస్తుతం రామ్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా స్కంద( Skanda ).ఈ మూవీతో రామ్ పోతినేని ఎలా అయినా హిట్ కొట్టి తీరాల్సిందే.
తన గత చిత్రం ది వారియర్ సినిమాతో భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్నాడు. """/" /
ఈ సినిమాతో ది వారియర్ చిత్ర నిర్మాతలకు దాదాపు రూ.
17 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.దీంతో స్కంద సినిమాతోనైనా ఎలాగైనా రామ్( Ram Pothineni ) హిట్ కొట్టాల్సిందే.
ప్రజెంట్ రామ్ ఎదురుగా రూ.60 కోట్ల టార్గెట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లో టాలీవుడ్ లో ఇద్దరు హీరోల సినిమాలు హిట్ కాకుండా వారికి ఇండస్ట్రీలో గడ్డు పరిస్థితులు ఎదురవడం గ్యారెంటీ.
దీంతో ఇద్దరు హీరోలకు ఇప్పుడు వారి రాబోతున్న సినిమాలతో సక్సెస్ కొట్టాల్సిందే.అంతే కాకుండా ఈ ఇద్దరు హీరోల పైన నిర్మాతలు భారం మొత్తం వేశారు.
పొరపాటున ఈ సినిమాలు డిజాస్టర్ లుగా నిలిస్తే మాత్రం ఈ ఇద్దరు హీరోలు కెరియర్ రిస్క్ లో పడటం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
కేంద్రం మంత్రి బండి సంజయ్ ఇప్పుడు ఎక్కడున్నారు..?