విశ్వంభర తో వశిష్ట కి అదృష్టం దక్కబోతుందా..?
TeluguStop.com
వశిష్ట ( Vasista )డైరెక్షన్లో చిరంజీవి చేస్తున్న విశ్వంభర( Vishwambhara Movie ) సినిమాకి సంబంధించిన టీజర్ ని దసర కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
మొత్తానికైతే ఈ టీజర్ ని భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు.ఇక అది ప్రేక్షకులను అలరించడమే కాకుండా చాలా గ్రాండీయర్ గా ఉంది.
నిజానికి చిరంజీవి కూడా ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.
నిజానికి 30 సంవత్సరాల వయసు గల కుర్రాడిగా చిరంజీవి కనిపించడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి.
70 సంవత్సరాల వయసులో కూడా ఇలా యంగ్ లుక్ లో కనిపించడం చిరంజీవికి మాత్రమే సాధ్యమవుతుంది.
ఇక ఇదిలా ఉంటే వశిష్ట చేస్తున్న ఈ భారీ ప్రయోగంలో చిరంజీవి ఒక పెను సంచలనాన్ని సృష్టించబోతున్నట్లుగా తెలుస్తోంది.
"""/" /
ఇక సైరా సినిమాతో ( Movie Saira )పాన్ ఇండియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి అక్కడ మాత్రం ఆయనకు అనుకున్న రేంజ్ లో సక్సెస్ దక్కలేదు.
మరి ఇప్పటికైనా విశ్వంభర సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించి కలెక్షన్ల వర్షం కురిపించడమే లక్ష్యంగా పెట్టుకొని చిరంజీవి ముందుకు సాగుతున్నాడు.
ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని అయితే సంతరించుకుంటుంది.మరి ఈ విశ్వంభర సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.
ప్రేక్షకుడిని ఎలా సంతృప్తి పరుస్తుందనేది తెలియాల్సి ఉంది. """/" /
ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక వరం అనే చెప్పాలి.
ఆయన చేసిన క్యారెక్టర్లు ఆయన సాధించుకున్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఈ సినిమా కనక పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయితే వశిష్ట టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన స్నేహితులు