ఈ మ్యానిఫెస్టో బీజేపీ ‘ దశ – దిశ ‘ మార్చేనా ? 

తెలంగాణలో వెనకబడి పోయామన్న అభిప్రాయంలో ఉన్న బిజెపి బీఆర్ఎస్ , కాంగ్రెస్ ( BJP BRS Congress )లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే బీఆర్ఎస్ లు ఎన్నికలు మేనిఫెస్టోను ప్రకటించిన నేపథ్యంలో బిజెపి కూడా రేపు దశ దిశ పేరుతో కొత్త మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది .

అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా , జనాలు చూపు బిజెపి వైపు పడేవిధంగా బిజెపి వ్యవహాత్మకంగా దశ దిశ పేరుతో మేనిఫెస్టోను రూపొందించింది.

  ముఖ్యంగా గల్ఫ్ బాధితుల కోసం మోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయడంతో పాటు,  గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ తెలంగాణ భవన్ లను నిర్మిస్తామని హామీని బిజెపి పొందుపరిచినట్లు సమాచారం.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ వేయాలని మేనిఫెస్టోలో రూపొందించారట ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఎత్తివేయాలని,  ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

"""/" /  రైతులకు సబ్సిడీపై విత్తనాలు ,  వరిపై బోనస్ వంటివి మేనిఫెస్టోలో చేర్చమన్నారట .

బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ధరణి పోర్టల్ పెద్ద స్కాం అని, ఆ స్థానంలో మీ భూమి పేరుతో యాప్ తీసుకురావాలని బిజెపి( BJP ) భావిస్తుందట.

ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి ఉచితంగా నాలుగు సిలిండర్లు అందించాలని మేనిఫెస్టోలో రూపొందించారట .

మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రైవేట్ యాజమాన్యాల ఫీజుల దోపిడీకి అడ్డుకట్టు వేసేందుకు నిరంతరం పర్యవేక్షణకు చర్యలు చేపట్టే విధంగా కొత్త మేనిఫెస్టోలో చేర్చనున్నారట.

  బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మిరహాయింపు చేయాలని,  ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి జిల్లాకు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని బిజెపి ప్లాన్ చేస్తోందట.

దీంతో పాటు మూతపడిన నిజాం సుగర్స్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ,  ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు , పిఆర్సిపి రివ్యూ చేయడంతో పాటు,  ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి పిఆర్సి ఇచ్చేలా హామీ ఇవ్వబోతున్నారు.

"""/" / ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 నిండిన వారికి రెండు లక్షల సాయం,  బీసీల సంక్షేమం కోసం ఐదేళ్ల కు లక్ష కోట్ల నిధి ఏర్పాటు , రోహిన్యాలు , అక్రమ వలసదారులను ఇక్కడ నుంచి తిరిగి పంపించేలా ఏర్పాటులు కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు హామీని మేనిఫెస్టోలో చేస్తున్నారట.

  తెలంగాణలో ఉమ్మడి స్మృతి అమలు , అన్ని పంటలకు బీమా వంటి అంశాలను చేర్చనున్నారట .

దీంతో పాటు వృద్ధులకు కాశి , అయోధ్య లకు ఉచిత ప్రయాణం కల్పించే దిశగాను బిజెపి ( BJP )ఆలోచన చేస్తోందట.

  మొత్తంగా ప్రజల ను ఆకట్టుకునే విధంగా దశ దిశా పేరుతో కొత్త మేనిఫెస్టోను రేపు బిజెపి విడుదల చేయనుంది.

.

రక్తహీనత నుంచి తొందరగా బయటపడాలనుకుంటే ఈ ఆహారాలను తప్పక తీసుకోండి!