రోబోని ఇలా కూడా దోచేస్తారా.. మహిళ చేసిన పనికి పగలబడి నవ్వుతున్న నెటిజన్లు..

రోబోని ఇలా కూడా దోచేస్తారా మహిళ చేసిన పనికి పగలబడి నవ్వుతున్న నెటిజన్లు

ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది, నెటిజన్లు మాత్రం పగలబడి నవ్వుతున్నారు.

రోబోని ఇలా కూడా దోచేస్తారా మహిళ చేసిన పనికి పగలబడి నవ్వుతున్న నెటిజన్లు

ఇంతకీ ఏం జరిగిందంటే.వీడియోలో ఒక రోబో ఎర్రటి బ్యాగు (Robot Red Bag)పట్టుకుని నిల్చుంది.

రోబోని ఇలా కూడా దోచేస్తారా మహిళ చేసిన పనికి పగలబడి నవ్వుతున్న నెటిజన్లు

అప్పుడే వెనుక నుంచి వచ్చిన ఓ అమ్మాయి చకచకా ఆ బ్యాగుని లాగేసి, తన బ్యాగుని అక్కడ పెట్టేసింది.

పాపం రోబోకి ఏం జరిగిందో అర్థం కాలేదు.బ్యాగు ఎక్కడికి పోయిందో అని గుండ్రంగా కళ్లు తిప్పి చూసింది.

ఆ అమ్మాయి వైపు జాలిగా చూస్తూ.ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అని ఆశగా చూసింది.

కానీ ఏం లాభం? బ్యాగ్ కలర్ మారిపోయేసరికి దానికి గుర్తుపట్టడం కష్టమైపోయింది. """/" / ఇది నిజం వీడియోనో లేక AI మాయో తెలీదు కానీ, "రాండమ్ ఇండియన్" ("Random Indian")అనే ఇన్‌స్టా పేజీలో రెండు రోజుల కిందట పోస్ట్ చేశారు.

అప్పటినుంచి ఇప్పటివరకు 2 కోట్ల దాక వ్యూస్ సాధించింది, అంతే కాదు కామెంట్ల వర్షం కురుస్తోంది.

నెటిజన్లు ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు."AI ఇంకా దీనికి రెడీగా లేదు" అని ఒక యూజర్ పంచ్ డైలాగ్ వేస్తే, ఇంకొకరేమో "ఇది సిలబస్‌లోనే లేదు గురూ" అంటూ నవ్వులు పూయించారు.

"హ్యాకర్ డెవలపర్‌ని (Hacker Developer)కలిస్తే ఇలాగే ఉంటది మరి" అంటూ ఇంకొక యూజర్ కామెంట్ సెక్షన్ నింపేశాడు.

అయితే కొంతమంది మాత్రం AI టెక్నాలజీతో వచ్చే రిస్కుల గురించి కాస్త సీరియస్‌గా ఆలోచిస్తున్నారు.

"అడ్వాన్స్డ్ AI రోబోలకి ఎక్స్-రే విజన్ ఉంటది కదా బాసూ, దాంతో దేన్నైనా స్కాన్ చేస్తది కదా" అని ఒకరు డౌట్ పడితే, "అవును నెక్స్ట్ టైం ఎక్స్-రే తో వెతుకుతది చూడు" అని ఇంకొకరు జోక్ వేశారు.

"""/" / నెటిజన్లు కామెడీ కామెంట్ల మోత మోగిస్తున్నారు."AI – అంటే 'ఆడ ఇంటెలిజెన్స్' అన్నమాట", "ఎర్రర్ కోడ్ 404 – రెడ్ బ్యాగ్ నాట్ ఫౌండ్" అంటూ ఫన్నీ కామెంట్లు పేల్చారు.

"ఈ రోబోని బీహార్ తీసుకెళ్లండి, అక్కడ అసలు బతకదు" అంటూ ఒక యూజర్ సెటైర్ వేశాడు.

బీహార్‌లో మనుషులు చాలా తెలివైన వాళ్లు ఉంటారని, అక్కడ ఇలాంటి ట్రిక్స్ చెల్లవని ఆ యూజర్ ఉద్దేశం కావచ్చు.

ఏదేమైనా ఈ వీడియో అందరికీ కడుపు చెక్కలయ్యేలా నవ్వు తెప్పించింది.AI టెక్నాలజీ ఎంత ఎదిగినా, మనుషుల తెలివితేటలు, ముఖ్యంగా వాళ్ల చిలిపితనం ముందు ఇంకా తక్కువే అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

తన అద్భుతమైన యాక్టింగ్ తో అదరగొట్టిన మహేష్ బాబు కొడుకు.. ఏం జరిగిందంటే?