బీజేపీ చెప్తే అరెస్ట్ చేస్తారా.?: ఎమ్మెల్సీ కవిత

విపక్ష నేతలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

బీజేపీ వాళ్లు చెప్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.అలాంటప్పుడు ఏజెన్సీలు ఎందుకని మండిపడ్డారు.

మోదీ వైఫల్యాలను ప్రశ్నించినందుకు ఏజెన్సీలతో దాడులా అని కవిత ప్రశ్నించారు.రాయపూర్ లో కాంగ్రెస్ ప్లీనరీకి ముందు ఇలానే చేశారని ఆరోపించారు.

రాయపూర్ లో కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జరిగాయన్నారు.లిక్కర్ స్కాంను డైవర్ట్ చేయడానికి మహిళా బిల్లు కోసం ప్రొటెస్ట్ చేస్తున్నామనడం సరికాదని చెప్పారు.

అలా అనుకుంటే అదానీ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి గ్యాస్ ధర పెంచారా అని నిలదీశారు.

బెంగళూరులో ఆస్తుల కొనుగోలుపై ఎన్ఆర్ఐల ఇంట్రెస్ట్ .. ఎందుకిలా?