ఈ కొత్త ఏఐ టూల్స్ భవిష్యత్తులో ఉద్యోగాలను సృష్టించనున్నాయా? పాడుచేయనున్నాయా?
TeluguStop.com
ప్రపంచ ఆర్థిక మాంద్యం, మరీ ముఖ్యంగా యుయస్ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు వేలాది ఉద్యోగస్తులకు పంకనామం పెడుతున్న సంగతి తెలిసినదే.
ఇది చాలదన్నట్టు మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) (ఏఐ) ఎంట్రీతో మరిన్ని ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే భయాలు పలు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులను ఇపుడు దారుణంగా వెంటాడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇప్పటికే పలు టెక్ దిగ్గజ కంపెనీలు ఏఐ వైపు మొగ్గు చూపుతుండడం కొసమెరుపు.
కృత్రిమ మేధస్సు అనే అంశం గురించి 1956లో జాన్ మెక్‌కార్తీ( John McCarthy ) మొదటి విద్యాసంబంధ సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఇది వెలుగులోకి రావడం చాలామందికి తెలియని అంశం.
ఇక 2022లో శరవేగంగా కృత్రిమ మేధస్సు జనాల ముందుకు వచ్చింది.కృత్రిమ మేధస్సు మనిషిలాగే ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం చేయడం ఇపుడు మనుష్యులకు బెంగ కలుగుతోంది.
వ్యాపార సామర్థ్యాన్ని పెంచడంలో, నిర్ణయం తీసుకోవడంలో ఖర్చులను తగ్గించడంలో కూడా ఏఐ సాయపడుతుందనేది ప్రధాన ఆలోచన.
అందుకే పలు టెక్ కంపెనీలు( Tech Companies ) వీటిపైన దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.
"""/" /
కృత్రిమ మేధస్సు విషయంలో చాట్ జీపీటీ( Chat GPT ) ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది.
కంటెంట్ రాయడంలోనూ, కంటెంట్ ని సృష్టించడంలోనూ, కస్టమర్ డేటాను విశ్లేషించడం, ట్రెండ్‌లను గుర్తించడంతో పాటు, కస్టమర్ల ఆసక్తులు, అవసరాలకు అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించేందుకు ఇలాంటి కృత్రిమ మేధస్సుకి సంబందించిన టూల్స్ ఇపుడు ఎంతగానో వినియోగపడుతున్నాయనేది నిపుణుల మాట.
ఈ క్రమంలో చాలామందికి కలుగుతున్న భయం ఏమంటే రానున్న భవిష్యత్తులో వీటివలన మనుషుల ఉద్యోగాలు పోతాయని పలువురు అభిప్రాయపడగా కొంతంతమంది మాత్రం వీటివల్ల మరిన్ని ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు.
"""/" /
ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలకుపయోగపడే కొన్ని ఏఐ టూల్స్ లిస్ట్ పరిశీలిద్దాము.
చాట్ జీపీటీ
క్విల్‌బాట్: ఇన్‌స్టంట్ పారాఫ్రేజర్
అప్‌వర్డ్: ఇన్నోవేటివ్ సమ్మరైజర్
కెరీర్‌దేఖో ఏఐ
ల్యాంగ్వేజ్‌ప్రొ
అడాప్టివ్ ఎకాడమీ
రెస్యూమ్ చెక్
ఫింగర్ పప్రింట్ సక్సెస్
అన్‌స్కూలర్
రెస్యూమ్ ఏఐ
పాయిజ్డ్
ప్రాడిజీ ఏఐ
లాంగోటాక్ins Datetime="2023-05-09T02:33:46+00:00".
గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?