సోము వీర్రాజు మాటల్లో ఇక మార్పు రాదా...?
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు ఏపీలో ఆసక్తికరంగానూ.ఆశ్చర్యకరంగానూ ఉంటున్నాయి.
ఏపీలో నిజమైన ప్రతిపక్షం బీజేపీ నంటూ చెప్పుకుంటున్నారు.గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని మరీ వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని చెప్తున్నాడు.
ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికలో కూడా గెలిచేది తామేనని ప్రెస్ మీట్ లలో చెప్పేస్తున్నాడు.
అయితే బీజేపీ సోము వీర్రాజుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి వీర్రాజు న్యాయం చేస్తున్నాడు.
మీడియా ఫోకస్ కోసం రెగ్యూలర్ గా తెగ మాట్లాడేస్తుంటాడు.ఏపీలో పార్టీని ఎక్కడికో తీసుకెళ్లడానికి ఆరటపడుతున్నాడు.
అయితే ఏ మాత్రం మొహమాటం లేకుండా బీజేపీ ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తుంది అన్నట్లు తెగ బిల్డప్ లు ఇచ్చేస్తుంటాడు.
రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా, పోలవరం ఇవేమి పట్టవు కానీ.ప్రస్తుతం అధికారంలోకి వస్తే తొలిసంతకం కాడికి పోయింది మేటర్.
రాష్ట్ర రాజధనిగా అమరావతికి కోట్లల్లో నిధులు తీసుకువస్తామని.ఏకంగా మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పుకుంటున్నారు.
అమరావతిలోనే రాజధాని కడతామని.బీజేపీ అధికారంలోకి వస్తే రాజధాని అంశంపైనే మొదటి సంతకం చేస్తామని అంటున్నారు.
వైసీపీవి కేవలం నవరత్నాలు మాత్రమేనని.అదే బీజేపీవి వంద రత్నాలని సోము వీర్రాజు చెప్తున్నారు.
ఏపీలో ఇక కాసుకోండి అధికారం మాదే అన్నట్లు సవాల్ చేస్తున్నారు.కాగా జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే జనసేన అధినేత ఏ ఒప్పందంతో పొత్తుకు సై అన్నాడు.మరి పొత్తు పెట్టుకుంటే కాలం కలిసివచ్చి ఏపీ ప్రజలు కనికరిస్తే సీఎం కుర్చీపై ఎవరు కుర్చుంటారు.
ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీ అధికారంలోకి రావడం.తొలి సంతకాలు.
కోట్ల రూపాయలు ఇవి ఎలా జరుగుతాయనేది కూడా అస్సలు పట్టించుకోవడం లేదుగా.అంటున్నారు జనాలు.
"""/" /
అయితే సోము వాస్తవాలకు దగ్గరమాట్లాడితే వినాలని చాలా మంది ఎదురుచూస్తున్నారనేది టాక్.
అయితే ఇప్పుడ ఆత్మకూరు ఉప ఎన్నికలో కూడా పార్టీ పోటీచేస్తుందని.కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ దూరం అంటూ అందుకే పోటీ చేస్తున్నామని అంటున్నారు.
ఇక ఇదేనెలలో ఏపీకి జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తుండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు.మరి ఏపీ ప్రజలకు ఏమి హామిలు ఇప్పిస్తారో.
అధికారంలోకి రాగానే మొదటి సంతకం.అనిపిస్తారో చూడాలి.
వైరల్ వీడియో: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్యాన్స్ తో సందడి చేసిన కలెక్టర్