అల్లు అర్జున్ బోయపాటి కాంబోలో సినిమా రానుందా..? ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu).

ఆయన చేసిన భద్ర సినిమా నుంచి వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ముఖ్యంగా మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన టైప్ ఆఫ్ మేకింగ్ తో కూడా ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆయన చేసిన స్కంద(skanda) సినిమా పెద్దగా సక్సెస్ సాధించనప్పటికి ప్రస్తుతం ఆయన బాలయ్య బాబుని(Balayya Babu) హీరోగా పెట్టి అఖండ 2(Akhanda 2) అనే సినిమాని కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా తొందర్లోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో బాలయ్య బాబును చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

ఇక బాలయ్య బాబుతో పాటు అల్లు అర్జున్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో సరైనోడు అనే సినిమా వచ్చింది. """/" / ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటుగా అల్లు అర్జున్ (Allu Arjun)కి మంచి మాస్ హీరో ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది.

మరి ఇలాంటి సందర్భంలో మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడమే కాకుండా సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ట్రెడ్ పండితులు సైతం భావిస్తున్నారు.

కానీ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు కాబట్టి బోయపాటి శ్రీను కి తనతో సినిమా చేసే అవకాశం ఇస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

కొత్త కోడలికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు… అమల సంచలన వ్యాఖ్యలు!