గడప గడపకు కార్యక్రమంతో వైసీపీకి లాభమా? నష్టమా?

గత ఎన్నికల్లో రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదం వైసీపీకి ఎంత బూస్టప్ ఇచ్చిందో అందరికీ తెలిసిన విషయమే.

అయితే వచ్చే ఎన్నికల్లో క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదాలతో రంగంలోకి దిగాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేసుకుంటున్నాయి.

దీనికి కారణంగా ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే.వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమంతో ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి.

చాలా ప్రాంతాల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఇంటి గడప కాదు కాదా ఊరు పొలిమేర దాకా కూడా చేరలేకపోతున్నారు.

ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యేలకు సొంత నియోజకవర్గ ప్రజలు షాకిచ్చారు.

ఆయన గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లగా జి.సిగడాం మండలం విజయరామపురం గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఎదురుతిరిగారు.

ఆయన కారును కూడా గ్రామంలోకి రానివ్వలేదు.ఏం చేశారని ఇప్పుడు నియోజకవర్గంలోకి వస్తున్నారని నిలదీశారు.

తాగునీరు, ఫించన్‌లు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆరోపించారు.మరోవైపు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సొంత నియోజకవర్గం భీమిలిలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

చిన్నాపురం గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏడాది దాటినా ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఇవ్వలేదని అవంతి శ్రీనివాస్‌ను ఓ మహిళ నిలదీసింది.

ఇంటి నిర్మాణం కూడా పూర్తయిందని.ఇప్పటికైనా డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి ముఖం మీదనే అడిగేసింది.

"""/" / ఇలాంటి పరిస్థితులు రాష్టమంతటా నెలకొన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.వితంతు ఫించన్‌‌లు తీసేశారని, ఉద్యోగాల నోటిఫికేషన్‌లు ఇవ్వడం లేదని పలు చోట్ల వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డగిస్తున్న సందర్భాలు ఉన్నాయి.

ప్రజాప్రతినిధులు బాగుపడుతున్నారని.ప్రజలను మాత్రం వివిధ రకాల పన్నుల పేరుతో దోచుకుతింటున్నారని ఆరోపిస్తున్నారు.

మొత్తానికి వైసీపీకి గడప గడపకు కార్యక్రమంతో లాభం సంగతి దేవుడెరుగు.భారీ నష్టం చేకూర్చే పరిస్థితులు నెలకొన్నాయని ఆ పార్టీ ప్రజాప్రతినిధులే వాపోతున్నారు.

చాలా చోట్ల సీఎం జగన్ డౌన్ డౌన్ అన్న నినాదాలు వినిపిస్తున్నాయని వైసీపీ నేతలు మథనపడుతున్నారు.

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బిగ్ షాక్..!!