ఈటెల 'బండి' వర్గం లోనే ఉంటారా.. వివేక్ మాస్టర్ ప్లాన్!

ఈటల రాజేందర్ ప్రస్తుతం ఈ పేరు రాష్ర్ట రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువులా మారింది.

తనకు టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదని కాషాయ కండువా కప్పుకున్నారు ఈ మాజీ మంత్రి.

బీజేపీలో చేరే ముందు తన ఎమ్మెల్యే పదవి కి కూడా రాజీనామా చేశారు.

దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా గట్టిగానే కృషి చేస్తుంది.

హుజురాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉండటంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.

"""/"/ ఇక్కడి వరకు బాగానే ఉన్నా.బీజేపీలో కూడా వర్గాలు ఉన్నాయని పలువురు అంటున్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య రెండు గ్రూపులు ఉన్నాయని అంటున్నారు.

ఇలా ఈటల రాజేందర్ కూడా బండి సంజయ్ గ్రూపులోకి వెళ్లాడని చెబుతున్నారు.ఈటల రాజేందర్ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా.

కూడా ఆయన బండి సంజయ్ వైపే మొగ్గు చూపాడని పలువురు స్థానిక నాయకులు చెబుతున్నారు.

కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారని చెబుతారు.

కానీ ఈటల రాజేందర్ మాత్రం ప్రస్తుతం బండి సంజయ్ వర్గంలో కలిశారట.ఇలా ఈటల రాజేందర్ బండి సంజయ్ వర్గంలో కలిసేందుకు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ తెర వెనుక కథ నడిపాడని చెబుతారు.

అంతే కాకుండా వివేక్ కు ఒక మీడియా హౌజ్ ఉండటం కూడా ఈటల బండి వర్గంలో చేరడానికి ఒక కారణం అని చెబుతారు.

బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ బండి సంజయ్ వర్గంలో చేరడంలో మాస్టర్ మైండ్ వివేక్ దే అని పలువురు చర్చించుకుంటున్నారు.

హిల్లరీ క్లింటన్‌కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం!!