మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు ఫ్యామిలీకి( Mohan Babu Family ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.
ఒకప్పుడు మోహన్ బాబు స్టార్ హీరోగా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో వెలుగొందిన విషయం మనకు తెలిసిందే.
కానీ ఇప్పుడు ఆయన నట వారసులు మాత్రం ఇండస్ట్రీలో అంత పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోతున్నారు.
కారణం ఏదైనా కూడా ఒక ఐడెంటిటి ని సంపాదించుకున్న మోహన్ బాబు తన వారసులను ఇండస్ట్రీలో సెటిల్ చేయడంలో మాత్రం చాలా వరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన గొడవలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక మొన్నటికి మొన్న మనోజ్ ను( Manchu Manoj ) వాళ్ల విద్యాసంస్థల్లోకి వెళ్తుంటే అడ్డుకున్న సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది.
"""/" /
ఇక ప్రస్తుతం మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలు చేస్తు ముందుకు సాగుతున్నప్పటికి వస్తున్న వివాదాల విషయంలో మాత్రం ఆయన కొంతవరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడనే చెప్పాలి.
ఈ విషయంలో మనోజ్ చాలా క్లారిటీగా ఉన్నప్పటికి వాళ్ళ అన్నయ్య మంచు విష్ణు,( Manchu Vishnu ) వాళ్ల నాన్న మోహన్ బాబుతోనే తనకు ఇబ్బందులు ఉన్నాయంటూ పదేపదే చెబుతూ వస్తున్నాడు.
మరి వీళ్ళ ఇబ్బందులు తొలగిపోయి వీళ్ళందరూ కలిసి మళ్లీ సినిమా చేసేది ఎప్పుడు అంటూ మంచు అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కి ఉన్న గౌరవం మొత్తం తన కొడుకుల ద్వారా పోతుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం.
ఇక ఇప్పటికైనా వీళ్ళందరూ కలిసిపోయి ఉంటే మంచిది అనే కామెంట్లు కూడా వస్తున్నాయి.
చూడాలి మరి వీళ్ళు ఎప్పుడు కలిసిపోతారు అనేది.
చందు మొండేటి సూర్య కాంబో ఫిక్స్ అయినట్లేనా..?