ఆ 4 నియోజకవర్గాల్లో నిజామాబాద్ వ్యూహం..సక్సెస్ అవుతుందా..?

తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మూడవసారి ఎన్నికలు.

ఇంతకుముందు జరిగిన రెండు ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ఈసారి ఎన్నికలు మరో ఎత్తుగా చెప్పవచ్చు.

మొదటిసారి తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్(KCR) , తర్వాత కూడా అదే సెంటిమెంట్ ను వాడుకొని రెండోసారి అధికారంలోకి వచ్చారు.

అయితే మూడోసారి కూడా అదే పంథను కొనసాగిస్తానని చెబుతున్నారు.అలాంటి బిఆర్ఎస్ కు ఈసారి కాంగ్రెస్ (Congress) గట్టి పోటీని ఇవ్వబోతోంది.

కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించాలని భావిస్తోంది.అయితే ఈసారి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు పోటీ చేసే నియోజకవర్గాల్లో అమరవీరుల కుటుంబాలు నామినేషన్స్ వేయాలని నిర్ణయించుకున్నారట.

"""/" / కేసీఆర్, కేటీఆర్(KTR), హరీష్ రావు, పోటీ చేసే స్థానాల్లో ఒక్కో నియోజకవర్గానికి కనీసం 150 మందితో నామినేషన్లు వేస్తామని వారు అనుకున్నారట.

తెలంగాణ ఉద్యమ సమయంలో అమరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటివరకు నెరవేర్చలేదని, అవి నెరవేర్చకుండా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని ఈ విధంగా ఓడించాలని ప్రతి నియోజకవర్గంలో 150 పైగా నామినేషన్లు వేయాలని వారు నిర్ణయించుకున్నారట.

"""/" / ఇదే విధమైన ప్లాన్ గతంలో కవిత (Kavitha) కు వ్యతిరేకంగా నిజామాబాద్ (Nizamabad) పసుపు బోర్డు కోసం రైతులంతా కలిసి నామినేషన్లు వేశారు.

ఆ విధంగా కవితను ఓడించి చివరికి పసుపు బోర్డు సాధించారు.ఈ క్రమంలోనే కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్, కేటీఆర్ పోటీ చేసే సిరిసిల్ల, హరీష్ రావు పోటీ చేసే సిద్దిపేట, మరో నియోజకవర్గమైన కామారెడ్డిలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయాలని వారు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

గేమ్ ఛేంజర్ మూవీకి నెగిటివ్ ప్రచారం చేసింది వాళ్లేనా.. అసలేం జరిగిందంటే?