మునుగోడులో డబ్బు, మద్యం, లేకుండా ఎన్నిక‌లు జ‌రిగేనా?

మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక డబ్బు మద్యం, లేకుండా అధికార దుర్వినియోగం జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా అని ప్రజాస్వామ్యవాదులమనసును తొలుస్తున్న ప్రశ్న, ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుందా అని ఆలోచిస్తున్న మేధావి వర్గం ఈసారైనా నా ఓటు నేను వేసుకో గలనా అని ఆలోచిస్తున్న సగటు ఓటరు, పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టిన చందంగా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పాటికే ప్రచారం మొదలెట్టాయి.

మునుగోడు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఓట్లు వేసే యంత్రాలుగా నే మిగిలి పోయాం ఎప్పుడు పల్లకి మోసే బోయలు గానే మిగులా పల్లకిలో ఊరే గడానికి అర్హులం కామా ఒక్కసారి కూడా ఈ ప్రాంతం నుండి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం బీసీలకు రాలేదు.

పార్టీ ఏదైనా సరే ఉప ఎన్నిక లోనైనా బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని, ఆ సామాజిక వర్గానికి చెందిన, ఉద్యమకారులు,మేధావులు, విద్యావంతులు డిమాండ్ చేస్తున్నారు.

వారి న్యాయమైన డిమాండ్ ఏ పార్టీకి చెవికి ఎక్కినట్టు లేదు.ఇప్పుడున్న మూడు ప్రధాన పార్టీలలో ఏ ఒక్క పార్టీ అయినా ఉపఎన్నికలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే గెలుపు సునాయాస మే అవుతుంది కానీ ఆధిపత్య కులాల కనుసన ల్లో నడుస్తున్న ఆయా పార్టీలు బీసీలను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదు.

అధికార దాహం కోసం ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్న నాయకులు బీసీలను పట్టించుకుంటారు అనుకోవడం అత్యాశే అవుతుంది.

ఎన్నికలప్పుడు వారం రోజుల పాటు ఓట్ల కోసం కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనకాడని నాయకులు అధికారం దగ్గరికి వచ్చేసరికి బీసీలను రాజకీయ అంటరానివారిగా చూస్తున్నారు.

"""/"/ రాష్ట్రంలో వివిధ పార్టీలు చేపడుతున్న సభలు-సమావేశాలు బహిరంగ సభలు, పాదయాత్ర లన్ని బీసీల హక్కులను కాలరాయడా నికి, బీసీల మనస్సు రాజ్యాధికారం వైపు మళ్లకుండా తమవైపు మళ్లించుకోవడానికి చేస్తున్న దండయాత్రలేనని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

దానికి సరైన ఉదాహరణ, భూమికోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసంనిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిలోముందున్నది, అసువులు బాసిన దిఅత్యధికులు బీసీలే, చాకలి ఐలమ్మ, ఆమె భర్త చిట్యాల నరసయ్య, వారి కుమారులు, కూతురు, కొండా లక్ష్మణ్ బాపూజీ, దొడ్డి మల్లయ్య దొడ్డి కొమురయ్య లు ముందు వరుసలో ఉంటారు.

మహనీయుల పోరాటాల వల్లే భూస్వాముల చెరనుండి వే లాది ఎకరాల భూమిని విడిపించి నిరు పేదలకు పంచిన చరిత్ర కు నాంది వారు, ప్రత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతుంది.

అప్పటినుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ గాని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ గాని విమోచన దినాన్ని ఎందుకు నిర్వహించలేదు మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో బీసీ వాదం చాపకింద నీరులా వ్యాప్తిచెందుతున్న ది, ప్రజలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దృష్టిని ఇటు వైపు మళ్లించి బీసీ వాదం వ్యాప్తిని అరికట్టడానికి పన్నిన కుట్ర ఇది.

కంది పంట విత్తుకునే విధానం.. ఎరువుల యాజమాన్యంలో మెళుకువలు..!