ప్లాన్ అదే.. ఫలితం డౌటే ?

తెలంగాణలో అధికారం కోసం హస్తం పార్టీ( Congress Party ) గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, ఒక్క అవకాశం ఇవ్వాలని హస్తం నేతలు బలంగా ప్రజల్లోకి వెళుతున్నారు.

అంతే కాకుండా కే‌సి‌ఆర్( KCR ) పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను సైతం ఎండగట్టేలా ప్రకటనలు చేస్తూ బలం పెంచుకునే పనిలో ఉన్నారు.

అయితే ప్రస్తుతం హస్తంపార్టీ తెలంగాణలో ఫుల్ జోష్ లో ఉండడానికి ప్రధాన కారణం కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడమే.

అక్కడ ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆరు హామీలను.సేమ్ తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టోను రూపొందించింది.

"""/" / ఆ ఆరు హామీలనే ప్రధాన ఎన్నికల అస్త్రాలుగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.

అయితే ఈ హామీలే హస్తం పార్టీకి తలనొప్పిగా మారయా అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ వాదులు.

ఎందుకంటే కాంగ్రెస్ ప్రకటించిన హామీలతో రాష్ట్ర ఆర్థికాభివృద్ది దారుణంగా పతనం అవుతుందని జయ ప్రకాష్ నారాయణ్( Jaya Prakash Narayan ) వంటి వారు చెబుతుండడంతో ప్రజల్లో కూడా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై( Congress Six Guarantees ) ఆందోళన మొదలైంది.

పైగా తెలంగాణలో ప్రకటించిన హామీలు కర్నాటకలో( Karnataka ) అమలుకు నోచుయికోవడం లేదనే విమర్శలు కూడా వ్యక్తమౌతున్నాయి.

"""/" / ఈ నేపథ్యంలో దాంతో కర్నాటక హామీలనే తెలంగాణలో కూడా ప్రకటించి కాంగ్రెస్ తప్పు చేసిందా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

పైగా తెలంగాణలో బి‌ఆర్‌ఎస్( BRS ) ప్రభావం గట్టిగా ఉండడంతో అమలు సాధ్యం కానీ హామీలను ప్రకటించడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితి లేదనేది ఇప్పుడు హస్తం నేతల్లో నెలకొందట.

అందుకే ఆరు గ్యారెంటీల విషయంలో టీ కాంగ్రెస్ పునః పరిశీలనలో పడినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిప్శితున్నాయి.

ఇకపోతే ఆరు గ్యారెంటీలు మాత్రమే కాకుండా ఇటీవల పూర్తి మేనిఫెస్టో కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.

మేనిఫెస్టోలోని చాలా అంశాలు సేమ్ కర్నాటక మేనిఫెస్టోలో ఉన్న అంశాలే.మరి కర్నాటకలో సక్సస్ అయిన ప్లాన్ తెలంగాణలో ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

హెయిర్ ఫాల్ వెంటనే స్టాప్ అవ్వాలా.. అయితే ఇలా చేయండి!