కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందా ?

తెలంగాణ( Telangana )లో ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ తెగ ఆరాటపడుతోంది.

ప్రస్తుతం అటు ప్రజల్లోనూ కాంగ్రెస్ కు మద్దతు పెరుగుతూ ఉండడంతో ఈసారి విజయం ఖాయమనే ధీమాతోనే ఉన్నారు కాంగ్రెస్ నేతలు.

ఇక ఇతర పార్టీల నుంచి కూడా వలసలు పెరుగుతుండడం ఆ పార్టీ కాన్ఫిడెన్స్ ను మరింత పెంచే అంశం.

అయితే బి‌ఆర్‌ఎస్ ను ఢీ కొట్టి హస్తం పార్టీ అధికారం చేజిక్కించుకోగలదా ? ఆ సత్తా కాంగ్రెస్ కు ఉందా ? గత ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి ? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నాయి.

119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లను సాధించాల్సి ఉంటుంది.

"""/" / అయితే గతంలో హస్తం పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించిన దాఖలాలు లేవు.

1983 నుంచి జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఒక్కసారి కూడా మ్యాజిక్ ఫిగర్ అందుకోలేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు సంబంధించి 107 స్థానాలు ఉండగా 1983 లో 43 సీట్లు, 1989 లో 58 సీట్లు,1997 లో 6 సీట్లు, 1999 లో 42 సీట్లు, 2004 లో 48 సీట్లు, 2009 లో అప్పుడున్న 119 స్థానాలకు గాను 50 సీట్లు, ఇక రాష్ట్రం ఏర్పడ్డాక 20 సీట్లకు అటు ఇటు సాధిస్తూ వచ్చింది.

దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు దూరంగానే ఉందని చెప్పాలి.

ఇక ఈసారి కూడా హస్తం పార్టీని మ్యాజిక్ ఫిగర్ భయం వెంటాడుతోంది. """/" / ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ( Congress Party ) జోరు మీద ఉన్నప్పటికి ఎన్నికల్లో కూడా ఇదే ఊపు కొనసాగుతుందా అనేది అనుమానే.

కాంగ్రెస్ చెబుతున్నా దాని ప్రకారం ఈసారి ఎన్నికల్లో 70 నుంచి 80 సీట్లు గ్యారెంటీ అని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

సర్వేలు కూడా అనుకూలంగానే ఉన్నాయని నమ్ముతున్నారు.దీంతో ఈసారి మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం ఖాయమేనా ? అనే సమాధానం చెప్పడం కష్టమే.

ఎందుకంటే అటు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా ఉన్న బి‌ఆర్‌ఎస్ కూడా విజయం పై అంతే కాన్ఫిడెంట్ గా ఉంది.

ఈసారి ఎన్నికల్లో 100 పైగా సీట్లు సాధిస్తామని కే‌సి‌ఆర్ చెబుతున్నారు.మరి బి‌ఆర్‌ఎస్ పోటీని( BRS Party ) తట్టుకొని కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందా లేదా ఎప్పటిలాగే అడుగు దూరంలో నిలుస్తుందా అనేది చూడాలి.

అన్ని పార్టులుగా మహేష్ జక్కన్న కాంబో మూవీ.. ఫ్యాన్స్ సంబరానికి హద్దులు ఉండవుగా!