బర్రెలక్క ఎఫెక్ట్ ఆ నియోజకవర్గాలపై పడనుందా..?

బర్రెలక్క.ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసిన బర్రెలక్క పేరే వినిపిస్తోంది.

ఈమె ఒక పేద కుటుంబం నుండి వచ్చి ప్రస్తుతం ఇంత ఫేమస్ అయింది.

ఎక్కడో ఒక మారుమూలన ఉండే ఈమె సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయింది.

ఈ జనరేషన్లో చాలామందికి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఒక మంచి గుర్తింపుని ఇస్తుంది.

అలాంటి వారిలో ఈమె కూడా ఉందని చెప్పుకోవచ్చు.ఎన్ని డిగ్రీలు చదివిన జాబులు రాకపోవడంతో ఇలా బర్రెలు కాచుకొని బతుకుతున్నాను అంటూ ఒక వీడియో పెట్టి సోషల్ మీడియాలో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది.

అలాంటి ఈమెకు బర్రెలక్క అనే పేరు వచ్చింది.ఇక ఈమె అసలు పేరు శిరీష( Sirisha )అయితే ఎన్నో చదువులు చదివిన శిరీష జాబులు రాకపోవడంతో బర్రెలు కాచుకొని జీవనం కొనసాగిస్తుందట.

అయితే తన మెదడులో ఎలాంటి ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు కానీ ఎలాగైనా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యి నాలాంటి వారిని ఎంతోమందిని ఉత్తేజపరిచాలని ఒక కోరిక పుట్టింది.

దాంతో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో నామినేషన్ వేసింది.

నామినేషన్ వేసిన తర్వాత ఆమెను చాలామంది అవహేళన చేస్తూ చూశారట.అసలు ఈమె జీవనం ఏంటి.

నామినేషన్ వేయడం ఏంటి కనీసం వంద ఓట్లైనా వస్తాయా అని అందరూ హేళన చేశారట.

కానీ అవే నోర్లు ఒక వారం రోజుల్లో మారిపోయాయి.ఎందుకంటే ఆమెకు వచ్చిన ఫాలోయింగ్ అలాంటిది.

"""/" / నామినేషన్ వేసిన వారానికే ఆమె ప్రచారంలో దూసుకుపోయింది.చాలామంది ఇతర నియోజకవర్గాల జనాలు కూడా ఈమె దగ్గరికి వచ్చి ఈమె ఎన్నికల ప్రచారానికి తమ దగ్గర ఉన్న ఎంతో కొంత డబ్బుని విరాళంగా ఇస్తున్నారు.

అంతేకాదు ఎన్ఆర్ఐలు, ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఈమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

అలా చాలామంది ఈమెకు సపోర్ట్ చేస్తూ ఓటు వేయాలి ఆమెను గెలిపించాలి అని సోషల్ మీడియా( Social Media )లో పోస్టులు పెడుతున్నారు.

ఇక ఈమె ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే మాత్రం నరేంద్ర మోడీ( Narendra Modi ) కంటే ఈమె గ్రేట్ అని చెప్పుకోవచ్చు.

అంతేకాదు అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన అమ్మాయిగా కూడా ఈమె పేరు తెచ్చుకుంటుంది.

అయితే బర్రెలక్క కొల్లాపూర్ నియోజక వర్గం( Kollapur Assembly Constituency )లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిస్తే మాత్రం మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఎఫెక్ట్ పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎందుకంటే ఇక్కడ బర్రెలక్క గెలిస్తే మిగిలిన 118 నియోజకవర్గాల్లో మండలానికి ఒక బర్రెలక్క పుట్టుకొస్తారు.

"""/" / ఇలా చదువుకున్న వారిలో మార్పు వస్తుంది.ఇక ఈ విషయంలో భయపడిపోతున్న మిగతా పార్టీల నాయకులు బర్రెలక్క గెలవకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారట.

ఎందుకంటే ఆమె గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని,ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రశ్నిస్తారు అని మిగిలిన నియోజకవర్గపు నాయకులు అందరిలో భయం పట్టుకుందట.

మరి కొల్లాపూర్ బర్రెలక్క గెలిచి రాజకీయాల్లో మార్పు రావాలి అని మనం కూడా కోరుకుందాం.

బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి తన సత్తా చూపిస్తాడా..?