‘వారాహి విజయ యాత్ర’ 5వ విడత ప్రారంభం అయ్యేది అప్పుడేనా..? అయ్యోమయ్యం లో పడ్డ కార్యకర్తలు!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' ( 'Varahi Vijaya Yatra )తో పుట్టించిన ప్రకంపనలు మామూలుది కాదు.

ఒక్క మాటలో చెప్పాలంటే అధికార వైసీపీ కి ముచ్చమటలు పట్టించిన యాత్ర ఇది.

ప్రభుత్వం చేసిన తప్పులను ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ యాత్రలో బయటపెడుతూ జనాలకు వివరించిన తీరు అద్భుతం అనే చెప్పాలి.

ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ పై, అలాగే వాళ్ళ ద్వారా ప్రభుత్వం డేటా చోరీ ఎలా చేస్తుందో చెప్పిన విధానం వైసీపీ పార్టీ మూలాలు క్షేత్ర స్థాయి నుండి కదిలిపోయాయి.

పవన్ కళ్యాణ్ డేటా చోరీ గురించి మాట్లాడినప్పటి నుండి ఎవరైనా వాలంటీర్ ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నప్పుడు జనాలు ఎందుకు, ఏమిటి? అని అడగగడం ప్రారంభించారు.

జనాల్లో అంతటి చైతన్య కలిగించాడు పవన్ కళ్యాణ్ ఈ 'వారాహి విజయ యాత్ర' తో.

అందుకే ఈ యాత్ర అంటే జనాల్లో అంత క్రేజ్. """/" / యువత నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ప్రసంగాలను చూడడం ప్రారంభించింది ఈ యాత్ర ద్వారానే.

ఆ స్థాయి ఆదరణ దక్కించుకున్న ఈ యాత్ర అక్టోబర్ 7 వ తారీఖు నుండి ఆగిపోయింది.

చంద్రబాబు నాయుడు ని అరెస్ట్( Chandrababu Naidu Arrest ) చెయ్యడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తుని ప్రకటించడం, ఇలా చకచకా జరిగిపోయాయి.

పొత్తు ప్రకటించిన క్షణం నుండి 'వారాహి విజయ యాత్ర' ముందుకు కదలలేదు.దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మరియు జనసేన కార్యకర్తల్లో అయ్యోమయ్యం మొదలైంది.

అక్టోబర్ లో ఆగిన వారాహి యాత్ర ఇప్పటి వరకు మొదలు కాలేదు.పైగా పైసాకి ఉపయోగం లేని తెలంగాణ ఎన్నికలలో పోటీ చెయ్యడానికి జనసేన సిద్ధం అయ్యింది.

ఇక్కడే సమయం మొత్తం వృధా అవుతుంది.పోనీ సమయం వృధా చెయ్యకుండా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ అయినా చేస్తున్నాడా అంటే అది కూడా లేదు.

"""/" / సినిమా షూటింగ్స్ కూడా అక్టోబర్ నెల నుండి ఆగిపోయింది.ఇలా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అటు పక్క జనసేన కార్యక్రమాలు, ఇటు పక్క సినిమాలు రెండిట్లో నిశ్శబ్దం వహించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?, ప్రతీ సారి జనసేన గ్రాఫ్ వేరే లెవెల్ కి వెళ్తుంది అనుకుంటున్న సమయం లో ఇలా బ్రేకులు ఇచ్చి పవన్ కళ్యాణ్ ఉన్న గ్రాఫ్ మొత్తాన్ని తగ్గించేస్తున్నాడు .

2019 ఎన్నికల సమయం లో కూడా ఇలాగే చేసాడు.మళ్ళీ అలాంటి నిశబ్దమే ఇప్పుడు కూడా మైంటైన్ చేస్తున్నాడు.

మళ్ళీ 2019 ఫలితాలు రిపీట్ కాబోతున్నాయా?, ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే జనసేన పార్టీ ఏమైపోతుంది అనే ఆందోళన అభిమానుల్లో నెలకొన్నాయి.

అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్ర ని మళ్ళీ డిసెంబర్ రెండవ వారం నుండి ప్రారంభించబోతున్నట్టు సమాచారం.

చూడాలి మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది.

పుష్ప 2 సినిమా ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేయబోతుంది…