నేడు ఇంగ్లాండ్ ను నిలువరించి భారత్ సిరీస్ గెలిచేనా..??

ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యుత్తమైన ఆట కనబరుస్తూ టీమ్ ఇండియాను సైతం ముప్పుతిప్పలు పెడుతోంది.

టెస్ట్ మ్యాచులలో ప్రతికూలమైన పిచ్ కారణంగా టీమిండియా ఇంగ్లాండ్ పై గెలిచింది కానీ టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ పై గెలవడానికి టీమిండియా చాలా కష్ట పడుతోందని స్పష్టమవుతుంది.

తొలి టీ20 మ్యాచ్ లో గెలిచిన ఇంగ్లాండ్ 3వ మ్యాచ్ లో కూడా గెలిచి తన సత్తా చాటింది.

నాల్గవ మ్యాచ్ లో కూడా విజయానికి చాలా చేరువయ్యింది.అన్ని ఫార్మట్స్లో బలమైన పోటీ ఇస్తున్న ఇంగ్లాండ్ పై విజయం సాధించాలంటే మన భారత జట్టు ఖచ్చితంగా ఓ మంచి స్ట్రాటెజీతో ముందడుగు వేయాల్సి ఉంటుంది.

పేరుకు స్ట్రాంగ్ ప్లేయర్స్ గా ఉన్న భారత ఆటగాళ్లు మైదానంలో మెరుగైన ప్రదర్శన కనబరచకపోతే ఓడిపోయే ప్రమాదం ఉంది.

ఓపెనర్లైన రోహిత్, రాహుల్ తమ స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ చూపిస్తే చాలు ఇండియా సగం గెలిచినట్లే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా డక్ ఔట్ కాకుండా చాలా జాగ్రత్తగా ఆడుతూ జట్టును ముందుండి విజయ తీరాల వైపు నడిపించడం ప్రస్తుతం ఎంతో కీలకం.

ఎంతటి భారీ లక్ష్యాన్ని అయినా ఇంగ్లాండ్ క్రికెటర్లు ఛేదించడంలో దిట్ట కాబట్టి సూర్యకుమార్, పంత్, పాండ్యా ఎక్కువ పరుగులు చేయడం అత్యవసరం అయ్యింది.

"""/"/ మొదటగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే అత్యధిక లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచేలా బ్యాట్స్ మెన్లు ప్రయత్నించాలి.

ఇంగ్లాండ్‌ ఫేసర్లను ఎదుర్కోవడం కూడా భారత ఆటగాళ్లకు సవాలుగా మారింది.ఇరు జట్లలో టాలెంటెడ్ బ్యాట్ మెన్లు ఉండటంతో బౌలర్లకు ఇబ్బందులు తప్పవని స్పష్టమవుతోంది.

భువనేశ్వర్, శార్దూల్, హార్దిక్ పాండ్యా వంటి భారత బౌలర్లు చెలరేగి బట్లర్, రాయ్, మోర్గాన్, మలన్ వంటి ఇంగ్లాండు బ్యాట్స్ మెన్స్ లకు బ్రేకులు వేయాలి.

లేకపోతే మ్యాచ్ చేజారే ప్రమాదం ఉంది.భీకర బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉన్న ఇంగ్లాండ్ ని ఓడించడం కష్టమే కాని అసాధ్యం మాత్రం కాదు.

అయితే టీమ్ ఇండియాలో ప్రతి ఒక్క ఆటగాడు కూడా మెరుగైన ప్రదర్శన కనబరచకపోతే టీ20 సిరీస్ లో ఓటమిని చవి చూడాల్సిందే.

స్పీకర్ కి జగన్ రాసిన లెటర్ పై స్పందించిన బుద్ధా వెంకన్న..!!