TDP Super Six Manifesto : సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుందా ?
TeluguStop.com
సూపర్ సిక్స్( Super Six Manifesto ) పేరుతో తొలి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ,( TDP ) రాబోయే ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోనే తమను అధికారంలోకి తీసుకువస్తుందనే నమ్మకంతో ఉంది.
ప్రస్తుత అధికార పార్టీ వైసిపి పదేపదే సంక్షేమ పథకాలు గురించి ప్రచారం చేసుకోవడం, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని గొప్పగా చెప్పుకోవడం, ఇక జనాలూ సంక్షేమ పథకాల విషయంలో బాగా ఆకర్షితుల అవుతుండడంతో, టిడిపి కూడా ప్రజా ఆకర్షణ పథకాలకు రూపకల్పన చేసింది.
కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన మేనిఫెస్టోలోని కొన్నిటిని ప్రాతిపదికగా తీసుకుని టిడిపి సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది.
ఈ పథకాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకు వెళ్లే విధంగా ప్రచార వ్యూహానికి తెరతీసింది.
ఒకవైపు పొత్తులు, సీట్ల సర్దుబాటు పై దృష్టి పెడుతూనే, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్తోంది.
దీనికోసం ప్రత్యేక కార్యచరణను రూపొందించారు.సూపర్ సిక్స్ హామీల గ్యారంటీ కార్డులతో కూడిన కిట్ ను ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమానికి ఇప్పటికే మొదలు పెట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ ఈ కిట్ల పంపిణీ జరుగుతుంది. """/" /
మరోవైపు చూస్తే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) రాష్ట్రవ్యాప్తంగా శంఖారావం సభలు( Sankharavam Meetings ) పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ సభలను నిర్వహించనున్నారు.ఈ సభల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
తాము అధికారంలోకి వస్తే వెంటనే ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెబుతున్నారు.
ప్రస్తుతం జనసేన పార్టీతో టిడిపి పొత్తు( Janasena TDP Alliance ) పెట్టుకుంది.
బీజేపీ తోనూ ఆ ప్రయత్నాలు చేస్తున్నా, బిజెపి అగ్ర నేతలు ఇంకా ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
"""/" /
బీజేపీ నిర్ణయం ఏదైనా తాము ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమే అన్నట్లుగా టిడిపి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసింది .
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు వంటివి ఈ హామీల్లో చేర్చారు.
నిరుద్యోగులు, మహిళలను ఆకట్టుకునే విధంగా టిడిపి మేనిఫెస్టో ఉంది.మహాశక్తి ,అన్నదాత, యువగళం, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టూ రిచ్ వంటివి సూపర్ సిక్స్ లో ఉన్నాయి.
ఈ పథకాలే తమను అధికారంలోకి తీసుకొస్తాయనే నమ్మకంతో టిడిపి ఉంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024