రైతులను ఆదుకుంటాం.. రైతులు అదైర్యపడద్దు : తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మన్

రాజన్న సిరిసిల్ల జిల్లా:అకాల వర్షాలకు పంట నష్టపోయి రైతులు( Farmers ) సతమతమవుతున్న విషయం విధితమే.

కాగా,ఈ రోజు ఇల్లంతకుంట మండలం లోని ముస్కానిపేట గ్రామంలో వరిధాన్యం( Rice Grain ) కొనుగోలు కేంద్రాన్ని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్( Rasamayi Balakishan ) పరశీలించారు.

రైతులు అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.మండల వ్యాప్తంగా నష్టపోయిన పంటను అధికారులు గుర్తిస్తున్నారని.

ఎకరాకు రూ.10 వేలు నేరుగా రైతు అకౌంట్ లో జమ కానున్నాయని ఆయన భరోసానిచ్చారు.

పంటకోతకు వచ్చిన సమయంలో భారీ వర్షాలు, వడగళ్లవానలతో పంటను నష్టపోయిన రైతులేవరు అదైర్యపడోద్దని, ప్రతి రైతుకు పంటనష్టాన్ని ఇప్పించేందుకు నివేదికను సిద్దం చేయించి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం పంటనష్టాన్ని గురించి వ్యవసాయ అధికారులను అడిగితెలుసుకొని వెంటనే పంటనష్ట నివేదికను సిద్దం చేయించాలని ఆదేశించారు.

ఏపీకి ప్రధాని మోదీ ..  ఎప్పుడు ఎందుకు ?