తెలుగులో కూడా ‘పఠాన్’కు భారీ ఓపెనింగ్స్ రానున్నాయా?

బాలీవుడ్ స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్ ఒకరు.ఈయన ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ లోనే తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగాడు.

అయితే ఈయన మంచి హిట్ అందుకుని దశాబ్దం అవుతుంది.జీరో సినిమాతో అట్టర్ ప్లాప్ అందుకుని ఇప్పుడు భారీ గ్యాప్ తీసుకుని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రెజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్నారు.చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న విషయం విదితమే.

ఒకవైపు మన సౌత్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటుంటే బాలీవుడ్ మాత్రం హిట్స్ లేక బాధపడుతుంది.

అయితే షారుఖ్ అయినా బాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ అందిస్తాడేమో అని అంతా ఎదురు చూస్తున్నారు.

"""/" / ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

బాలీవుడ్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ ఆనంద్ సిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కు జోడీగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా హిందీతో పాటు తమిళ్, తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.

"""/" / మరి ఈ మేరకు ఇప్పటికే ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు.

ట్రేడ్ పండితులు చెబుతున్న దాని ప్రకారం హిందీతో పాటు ఈ సినిమా తెలుగులో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.

తెలుగు ఆడియెన్స్ కూడా ఈ సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.షారుఖ్ ఖాన్ చేస్తున్న ప్రమోషన్స్ కారణంగా ఈ సినిమాకు తెలుగులో మంచి వెల్కమ్ దక్కుతుంది అంటున్నారు.

చూడాలి బాలీవుడ్ సినిమా తెలుగులో ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో.