బాలయ్య కామెంట్లపై స్పందించని సమంత.. ఆ క్రిటిక్ ఏం చెప్పారంటే?

స్టార్ హీరో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా చేసిన కొన్ని కామెంట్లు అక్కినేని హీరోలకు కోపం, చిరాకు తెప్పించాయి.

ఏఎన్నార్ ను అవమానించే విధంగా బాలయ్య కామెంట్లు ఉండటం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధించింది.

అయితే అక్కినేని మాజీ కోడలు సమంత బాలయ్య కామెంట్ల గురించి స్పందిస్తారా అనే ప్రశ్నకు ఆమె స్పందించే అవకాశం లేదని తెలుస్తోంది.

అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి జోక్యం చేసుకోవాలనే ఆలోచన సమంతకు లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ సమంతకు ప్రస్తుతం ఆరోగ్యం బాలేదని ఈ వివాదం గురించి ఆమెకు తెలుసో లేదో చెప్పలేమని చెప్పుకొచ్చారు.

సమంత స్పందించాలని భావిస్తే మాత్రం కచ్చితంగా ఈ వివాదం గురించి స్పందిస్తుందని పేర్కొన్నారు.

"""/"/ ఈ వివాదం గురించి సమంత స్పందించడంలో తప్పేం లేదని అభిప్రాయపడ్డారు.నాగచైతన్య సమంత విడిపోయారని అయితే ఏఎన్నార్ విషయంలో సమంతకు నెగిటివ్ అభిప్రాయం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఇండస్ట్రీ పెద్దలు సైతం ఈ వివాదం గురించి నోరు మెదపడం లేదు.

చిరంజీవి గారు ఈ సమస్యను పరిష్కారం చేయాలని అనుకుంటే చేయొచ్చని దాసరి విజ్ఞాన్ తెలిపారు.

"""/"/ ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ఈ సమస్య విషయంలో జోక్యం చేసుకొని పరిష్కరిస్తే బాగుంటుంది.

ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది.తెలిసో తెలియకో ఈ వివాదం నెలకొన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ వివాదం గురించి ఎలా స్పందిస్తారో చూడాలి.

బాలయ్య ఇంత వ్యతిరేకత వస్తున్నా ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని మరి కొందరు చెబుతున్నారు.

ఈ విషయంలో నాగ్ చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.