సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా హీరో అవుతాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపైతే ఉంది.ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు.
వాళ్ళలో కొంతమంది సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక వాళ్లలో సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) ఒకరు.ఆయన సినిమాల పరంగా కొంతవరకు సెలెక్టెడ్ కథలను ఎంచుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇష్టం వచ్చిన కథలను సినిమాలుగా తెరకెక్కిస్తుంటే వరుసగా డిజాస్టర్లు వస్తున్న నేపధ్యంలో ఆయన కార్తీక్ వర్మ దండుతో కలిసి చేసిన వీరుపాక్ష సినిమా( Virupaksha ) సూపర్ సక్సెస్ అయింది.
ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ లో కూడా చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాల సెలెక్షన్స్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది.
కెరీర్ మొదట్లో స్టార్ హీరోగా మారిన ఈయన ఆ తర్వాత మొత్తం డల్ అయ్యాడు.
ఇక మధ్యలో యాక్సిడెంట్( Accident ) అవ్వడం పర్సనల్ విషయాల్లో కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టాయి.
దాని వల్ల కూడా అతని సినిమాల మీద కొంతవరకు ఎఫెక్ట్ అయితే పడింది.
మరి ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో మంచి విజయాలను సాధిస్తే స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి.
"""/" /
ఇక మెగా ఫ్యామిలీ( Mega Family ) అండ ఉండడంతో అతనికి పెద్దగా ప్రమాదం అయితే ఏమీ లేదు.
కాబట్టి కూల్ గా సినిమాలు చేసుకుంటూ మంచి విజయాన్ని సాధిస్తే స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటే మాత్రం ఆయన పాన్ ఇండియా లో కూడా స్టార్ హీరోగా వెలుగొందే అవకాశాలైతే ఉన్నాయి.