ధోని సరసన రోహిత్ నిలుస్తాడా.. నేడే టీ20 వరల్డ్ కప్ ఫైనల్..

జూన్ 29 2024 శనివారం నాడు రాత్రి 8 గంటలకు దక్షిణాఫ్రికాతో టీమిండియా టి20 వరల్డ్ కప్ 2024( T20 World Cup 2024 ) ఫైనల్లో తలపడుతుంది.

ఈ ప్రపంచ కప్ లో ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్క ఓటమిని కూడా చవి చూడకుండా ఫైనల్ కు చేరుకున్నాయి.

దీంతో నువ్వా.నేనా.

అన్నట్లుగా మ్యాచ్ జరగనుంది.ఇక టి20 వరల్డ్ కప్ ఫస్ట్ సీజన్ లో భాగంగా మహేంద్రసింగ్ ధోని( Mahendra Singh Dhoni ) నేతృత్వంలోని టీమ్ ఇండియా ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే.

ఇక 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి కప్ గెలుచుకునే అవకాశం వచ్చింది.

"""/" / ఇదివరకు కూడా ఓసారి అవకాశం ఇచ్చిన అప్పుడు విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి టీమిండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు వచ్చింది.

సెమీఫైనల్ లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండును భారీ తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది.

మరోవైపు దక్షిణాఫ్రికా కూడా సంచలన విజయాల నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) పై భారీ విజయాన్ని నమోదు చేసి ఫైనల్ కు చేరుకుంది.

ఇకపోతే నేడు బ్రిడ్జి టౌన్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు వర్షం అంతరాయంగా ఉండవచ్చు.

మ్యాచ్ టైం కాకుండా అదనంగా 250 నిమిషాల పాటు సమయాన్ని మ్యాచ్ జరగడానికి కేటాయించారు.

ఒకవేళ నేడు ఆట పాసిబుల్ కాకపోతే.రేపటికి రిజర్వ్డ్ డేను ఐసీసీ ముందే ఇచ్చింది.

"""/" / ఒకవేళ రిజర్వ్ డే కూడా మ్యాచ్ ను వర్షం అంతరాయం కలిగిస్తే చివరికి ఇరు జట్లని ప్రపంచకప్ విజేతలుగా ప్రకటిస్తుంది ఐసీసీ.

నేడు జరగబోయే మ్యాచ్ లో టీమిండియా ఒక మార్పుతో మ్యాచ్ ఆడనున్నట్లుగా తెలుస్తోంది.

బ్యాటింగ్ లో వరుస వైఫలాల నేపథ్యంలో శివం దూబేను టీం( Shivam Dubenu Team ) నుంచి తప్పించి జైస్వాల్ ఓనర్ గా పంపించే అవకాశం లేకపోలేదు.

దీంతో విరాట్ కోహ్లీ తన మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగవచ్చు.నేడు జరగబోయే మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో, అలాగే హాట్స్టార్ డిస్నీ యాప్ లో కూడా చూడవచ్చు.

ఇక నేడు జరగబోయే మ్యాచ్ లోని ఆటగాళ్లను ఇలా అంచనా వేయవచ్చు.టీమిండియా నుండి రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లి, పంత్, సూర్యకుమార్, దూబె లేదా జైస్వాల్, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్‌దీప్, అర్ష్‌దీప్, బుమ్రా లను అంచనా వేయవచ్చు.

ఇక మరోవైపు.,దక్షిణాఫ్రికా నుండి డికాక్, రీజా హెండ్రిక్స్, మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, కేశవ్‌ మహరాజ్, రబాడ, నోకియా, షంసి లను టీంలో ఆడడానికి అంచనా వేయవచ్చు.

ఆమె ఓ అందాల సితార… భారతీయ తెరపై ఆమె గీసిన ‘రేఖ’ చెరిగిపోదు ఎప్పటికీ!