సీనియర్ నేతల ఐక్యతకు రేవంత్ చేస్తున్న కృషి ఫలించేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎప్పటి నుండో ఉన్న పార్టీ అయినప్పటికీ  ప్రజల్లో ఎక్కువ ఉండటంతో వార్తలలో నిలవడం కాక పార్టీలో అంతర్గత కలహాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన పరిస్థితి ఉంది.

  ఇప్పటికీ కూడా అదే పరిస్థితి కాంగ్రెస్ లో కొనసాగుతోంది.ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో ఇంకా అందరూ కలిసి పోరాడుతూ ప్రజల్లో ఉంటేనే గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

కాని ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు.ఇటీవల కాస్త కాంగ్రెస్ లో ఐక్య రాగం వినిపించినా మరల జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిల వివాదంతో మరల మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ వార్తల్లో నిలిచిన పరిస్థితి ఉంది.

అయితే ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడం చాలా కష్టమైన విషయం.

అందుకే రేవంత్ రెడ్డి సీనియర్ నేతలకు తమకు మధ్య ఉన్న గ్యాప్ ను తొలగించుకోవాలనే విధంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే రేవంత్ రెడ్డిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేతలు రేవంత్ విజ్ఞప్తులను పట్టించుకునే పరిస్థితి కనిపించే అవకాశం ఉండక పోవచ్చు.

ఒకవేళ రేవంత్ సూచనలతో ఏకీభవిస్తే కాంగ్రెస్ పార్టీ పంట పండినట్టే అని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ అనేది చాలా గట్టి పోటీనిస్తున్న పరిస్థితి ఉంది.

"""/"/ బీజేపీని వెనక్కి నెట్టేలా కాంగ్రెస్ వ్యూహ రచన లేకపోతే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఇక మరల వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూడాల్సి ఉంటుంది అంతేకాక కెసీఆర్ ముచ్చటగా మూడో సారి అధికారం చేపడితే కాంగ్రెస్ పార్టీని కూడా కనుమరుగు చేసే అవకాశం ఉంది.

ఏది ఏమైనా వచ్చే రెండున్నరేళ్లు కాంగ్రెస్ కు చాలా కీలకమని చెప్పవచ్చు.