రవితేజ హీరోయిన్లను అలా టార్చర్ చేస్తారా… వైరల్ గా మారిన ఉమైర్ సందు కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ అనంతరం హీరోగా అవకాశాలు అందుకున్నారు మాస్ మహారాజ రవితేజ.

ఇలా రవితేజ(Ravi Teja) హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇలా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అయినటువంటి రవితేజ తనతో పాటు తన తమ్ముళ్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఈ మాస్ హీరో ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు.

"""/" / ఇక ఇండస్ట్రీలో ఉన్న తర్వాత పలువురు సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున ఎఫైర్స్ గురించి వార్తలు రావడం సర్వసాధారణం.

అయితే ఇలాంటి వార్తలు ఏవి లేకుండా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన రవితేజ హీరోయిన్ల పట్ల మాత్రం అసభ్యంగా ప్రవర్తిస్తారంటూ ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

తరచూ సెలబ్రిటీల గురించి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఉమైర్ సందు(Umair Sandu) తాజాగా రవితేజ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

"""/" / ఈ సందర్భంగా ఈయన రవితేజ గురించి మాట్లాడుతూ రవితేజ సినిమాలు చేసే సమయంలో హీరోయిన్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని వారిని తాకరాని చోట తాకుతూ ఇబ్బందులకు గురి చేస్తారంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా ఇప్పటికే రవితేజతో పాటు నటించిన ఎంతోమంది హీరోయిన్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారంటూ ఈయన కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

అయితే ఉమైర్ సందు తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈయన మాటలను నమ్మే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది.

అలాగే పలువురు సెలబ్రిటీలు ఈయన వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు కూడా ఫైల్ చేసిన విషయం మనకు తెలిసిందే.

మరి రవితేజ గురించి చేసిన వ్యాఖ్యలపై మాస్ హీరో రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

ప్రభాస్ దారిలో నడుస్తున్న అక్కినేని హీరో.. ఆ బ్యానర్ లో నటించనున్నారా?