ఆ రెండు రాజకీయ పార్టీల మధ్యలో నలిగిపోతున్న పుష్పరాజ్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప 2.

( Pushpa 2 ) సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్గా విడుదల కానుంది.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఒకవైపు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా మరొకవైపు ఈ సినిమాకు పొలిటికల్ కలర్ యాడ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

"""/" / ప్రస్తుత పరిస్థితులు చూస్తే అది నిజమే అని అనిపించక మానదు.

వైసీపీ నేతలు( YCP Leaders ) కొంతమంది పుష్ప 2 మూవీపై కామెంట్స్ చేస్తుండడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పుష్ప-2 క్రేజ్ ను తమవైపు తిప్పుకునేందుకు కొంతమంది ఇలా చేస్తున్నారా లేక అల్లు అర్జున్ తమవాడు అని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఈ రెండింటిలో ఏది చేసినా ప్రమాదమే.

అది కూటమి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించే వ్యవహారమే.ఒకవేళ అదే గనక జరిగితే ఆ ఫలితం కలెక్షన్లపై పడుతుందని చెప్పాలి.

నిజానికి అల్లు అర్జున్ కు రాజకీయాలకు( Politics ) సంబంధం లేదు.తన స్నేహితుడు కాబట్టి, శిల్పాకు మద్దతుగా నంధ్యాల వెళ్లానని అప్పట్లో బన్నీ విస్పష్టంగా తెలిపారు.

"""/" / అయితే అంతకుముందు ఎన్నడూ కూడా వైసీపీకి అల్లు అర్జున్ మద్దతుగా మాట్లాడింది లేదు.

ఎప్పుడూ వైసీపీ మద్దతుగా ఆయన మాట్లాడలేదు.అలా అని మరే ఇతర పార్టీని ఆయన పొగడలేదు.

కానీ కొంతమంది బన్నీపై అప్పట్లో విరుచుకుపడ్డారు.కాంపౌండ్ లో ఆ సెగ ఇంకా రేగుతూనే ఉంది.

అయితే ఇలాంటి టైమ్ లో వైసీపీ నేతలు కొంతమంది పుష్ప 2పై పని గట్టుకొని మరి మాట్లాడటం కూటమిలో కొంత మందికి ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు.

కాగా ఈ సినిమా సెన్సార్, విడుదలపై రాజకీయ నాయకులు దృష్టి పెడితే పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో గతంలో తమిళనాడు రాజకీయాల్లో చాలానే చూశాము.

రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సైతం ఒక దశలో మౌనంగా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మరి పుష్ప సినిమా పరిస్థితి కూడా అలాగే అవుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ను పెంచే సూప‌ర్ ఫుడ్స్ ఇవే!