మోక్షజ్ఞ విషయంలో బాలయ్య పెట్టుకున్న నమ్మకాన్ని ప్రశాంత్ వర్మ నిలబెడతాడా..?
TeluguStop.com
ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ( Prashanth Verma ) ఒకరు.
తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.
ఇక రీసెంట్ గా ఆయన చేసిన 'హనుమాన్ (Hanu-Man )' సినిమాతో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు 'జై హనుమాన్' సినిమాని చేస్తున్నాడు.
ఇక దీంతోపాటుగా బాలయ్య బాబు కొడుకుని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే ఒక పెద్ద బాధ్యతను అయితే ఆయన తీసుకున్నాడు.
"""/" /
మరి ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆయన ఎంచుకున్న కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక సోషియో ఫాంటసీ సినిమాగా ఆ సినిమాని తెరకెక్కించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారట.
ఇప్పటికే కథ మొత్తాన్ని ఫినిష్ చేసి బాలయ్య బాబుకు వినిపించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక బాలయ్య బాబు నట వారసుడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక మొదటి సినిమా కనక ఫ్లాప్ అయితే ఆయన మీద ప్రేక్షకుల్లో ఇంప్రెషన్ అనేది అంత పెద్దగా ఉండదు.
"""/" /
కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక బాలయ్య బాబు అంతగా నమ్మి మోక్షజ్ఞ ( Mokshajna )ను ప్రశాంత్ వర్మ చేతిలో పెడితే ఆయన ఎలాంటి క్రెడిట్ ని మోక్షజ్ఞ కి అందిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
చూడాలి మరి ప్రశాంత్ వర్మ మీద బాలయ్య బాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అనేది.
నా కాపురంలో హన్సిక చిచ్చు పెట్టింది.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!