ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కాంబో వర్కౌట్ అవుతుందా..?
TeluguStop.com
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది.ఎందుకంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి వచ్చే దర్శకులందరు పాన్ ఇండియాలో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
కాబట్టి తమదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక అందులో భాగంగానే కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నప్పటికి ఈయన దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా రెండు పార్టులుగా వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించింది.
"""/" /
ఇక సలార్ సినిమాతో( Salaar ) కూడా భారీ ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా తన కంటు ఒక మంచి మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇప్పటికే ఆయన కథ మాటలు అందించిన భఘీర సినిమా ( Bhagheera Movie )రిలీజ్ అయింది.
ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించలేదు.దాంతో ప్రశాంత్ నీల్ ఇమేజ్ కొంత వరకు డ్యామేజ్ అయిందనే చెప్పాలి.
మరి ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాల మీద ఈ ఎఫెక్ట్ కూడా భారీగా పడబోతున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగాలంటే మాత్రం ప్రశాంత్ నీల్ మంచి సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకుంటే మాత్రం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ అవుతాడు.
లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా డౌన్ అవుతుందనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా ఆయన స్టార్ డైరెక్టర్ గా మారితే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా భారీగా ఎలివేట్ అవుతుందనే చెప్పాలి.
విజయేంద్ర ప్రసాద్ రాసిన కథను చేంజ్ చేస్తున్న రాజమౌళి….కారణం ఏంటి..?